పుట:Kavitvatatvavicharamu.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

66 కవిత్వతత్త్వ విచారము

ముందు పూజ్యు లగుదురు గాక !

      “తే. అక్కజంబుగ నిప్ప డత్యంత దీప్తి
           వెలుఁగుచున్నావు భారతీ ! విమలమహిమ
           నాంథథేశేఅంబుతౌ మార్పు  లనుబవించి,
            యేమి చెప్పదుఁ? గలకాల మింక నెట్లో!"


మూఁడవ ప్రకరణము


కళాపూర్ణోదయము


కళాపూర్ణోదయ మాంధంబున నద్వితీయమైన గ్రంథమ. ఏజాతికిం జేరినదిగాదు. తనఁతట నొక క్రొత్తరకము. ఆంధ భారతాదులు సంస్కృతే తిహాసములకుం బరివర్తనములు. మన వసుచరిత్రాదులయందుఁ గథలు నవీనములుగావు. ప్రాచీనగ్రంథ ములనుండి గ్రహింపఁబడినవి. ఈ విమర్శనములకు గుఱియైన కావ్యమన్ననో కవియొక్క స్వసృష్టి బాణునిచే సంస్కృతమున రచింపంబడిన కాదంబరివంటిదని యందురు గాని, దానినుండియైన సూరనార్యుఁడు విషయముల గ్రహించినట్లు గానము. ప్రబంధ కవ లెవ్వరిలోనూ గనఁబడని ప్రతిభయు, భావనాశక్తియు, సందర్భ శుద్ధియు, పాత్రోచిత పద్యరచనయు నిందు సుప్రసిద్ధములు. ఇంత భావ గాంభీర్యము గలదియు నూతన పద్ధతులం బోవునది యునైనను కాలదోషము నెట్లు పూర్ణముగఁ దప్పించుకొనఁ గల్గును ? ప్రబంధ కవుల యందలి స్టాలిత్యములు నిందును బెక్కులు గలవు. కాని దోషములకన్న గుణములెన్నియో మడుంగు లెక్కువయని దృఢము గను మనఃపూర్తిగను జెప్పట కేయూతంకమును లేమి చదువరుల కెల్లను స్పష్టము. దీనివలె భావనాశక్తిచే నిర్మింపబడినదియు, తేజ రిలునదియునైన గ్రంథము తెనుగులో లేదు. పరదేశ భాషల యందలి పుస్తకములతోఁ బోల్చిచూచినను దీని క్రి గౌరవ హాని యే మాత్రమును గలుగదని నా యూశయము. మనకు నిది యేకము తనవంటిది මීබියි. ప్రశస్తములగు దేశాంతరకృతులతోఁ దులదూఁగఁ గలది యగుట, నన్యులు పరీక్షించినను దలవంచుకొన వలసినది గాదు.