పుట:Kavitvatatvavicharamu.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

 ప్రథమ భాగము 65 వారు ముఖ్యముగా దలంతురు ! అట్లగుట నల్పజీవితమును వారు సరుకు సేయుదు రా ? చేయరు. జాతికి జాతికి స్పర్ధయేర్పడుట వలన పాండిత్యము ప్రకటించి బ్రాహ్మణుల మీఅవలయునని రామ రాజ భూషణుఁడు యత్నించె నే మోయనుట విచార్యము ! ఏది యెట్లున్న నేమి ? అగ్రజాతులవారి యహంభావము, అశ్రద్ధ, ఆచారము ఇవి వేరుగను, అన్యజాతివారిని దమ మార్గమునకు నథీనులఁగా జేయుటయు, కవిత్వోచితమైన విషయమును మిక్కిలి సంగ్రహపఱచినవి. ఒక్క రాజులను రాజకన్యలను వదలినయెడఁ గవితకు గతి మోక్షము లుండవుగాఁ బోలు ! ఆంధ్ర కవిత్వము రాజు లను రాణులను నమ్మి జీవనము జరుపుకొనునది గనుక, వారైశ్వర్య మును గోలు పోయినతోడనే తానును వైరస్యమును వికృత వేషమును దాల్చవలసిన దాయెను. ప్రజలలో సత్త్వము స్థిరముగలేనిది కవిత నిత్యసౌభాగ్యము పడయ నేర్చు టెట్లు ?

                         మన యొక్క రాజుల దినములలో సైత మలవడనంత విన్యాసము నేఁడు ఆంధమును జెందియుండుటకు, బ్రిటిష్ వారి పరిపాలనమాహాత్మ్యమును, దానిచే మనయందు ప్రభవిల్లిన వృద్ధి నతిశయముగఁ జెందు దమను నుత్సాహమును ముఖ్యకారణములు. విద్యయు నెల్లరు శక్తి కొలఁది నిరాటంకముగ గ్రహింపవచ్చును. ఔనత్యమునకు సంఘ దురాచారముల నిర్మూలము జేయుట విడువ రానిసమయమగావుననాంధసాహితీపునరుద్ధరణ ప్రభావులైన శ్రీ వీరేశలింగముగారిచే దారి చూపఁబడిన యనేకులు, ప్రజల యొక్క మేలిమి నాసించి , వారలకు, దెలియనట్లు అనేక ముఖ్య విషయములఁ గూర్చి వ్రాయుచుండుటచే, భాష యందలి ప్రీతియు గౌరవమును, అభిలాషయయి, కుతూహలమును మును పెన్నఁడుఁ దాల్చి యుండనంత వ్యాప్తినిఁ బెంపును వహించుచున్నవి. ప్రకృతము కావ్యములు, నాటకములు, ప్రహసనములు ఇత్యాది కృతులతో నివేదింపఁబడు విషయముల సంఖ్యములు. సర్వజన హితములు. ప్రాతమార్గములనే యాపద్దతు లరిగిపోవునట్లు గొల్లైల మందలవలెఁ బో వునవిగావు. మఱియు దేశాభ్యుదయమను మహెూ ద్దేశము గల వె టు C బౌరుషోద్దీపకములు. నాయి కా నాయకులు సగమునకు సగము పలాయితులైరి. రాజులు రాణులును ప్రచ్ఛ న్నులై యే మూలం దాఁ గిరో యెందడcగిరో ! వెతకcబ డు వారు లేరు. వెదకు వారు ను లేరు ! కలియు గాది నుండి యింతదాఁక జముకు ఖర్చునకు రాని సాధారణజనులు నేఁటికిఁగదా గణ్యులైరి ! ఇఁక