పుట:Kavitvatatvavicharamu.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

64 కవిత్వతత్త్వ విచారము

లోని కవీశ్వరులు గొందఱు కాపువారు. సైనికులు మొదలైన తక్కువ వృత్తులవారి బదుకులును వర్ణనార్హములని భావించి యోంతో సుందరముగఁ గావ్యములలో వ్రాసియున్నారు. మన గ్రంథముల మాత్రము చదివి యీ పుణ్యక్షేత్రమైన కురుక్షేత్రము యొక్క స్థితి గతుల నరయఁ జూచువారికి, ఈ దేశము బీదసాదలపై నాదరము గల కవి యెవఁడైన నున్నాడా ? తుదకు, బీదసాదలైన నున్నారా ? యును సంశయము పట్టినను దప్ప వారిదిగాదు ! శ్లో కర సము వర్ణింప వలయునన్న ననుకూలమగు సందర్భ మెయ్యది ? క్రొవ్వు కాతెడు నాయి కానాయకుల యూహా మాత్రములైన కష్టములా ? ప్రజలు దినదినమునఁ గన్నీరు గార్చుటకైన నవకాశము లేక కుడుచుచుండు పరిపరి విధములైన గోడులా ? శాంతర సమునకుఁ బోషక మెయ్యది? తమకు నష్టముఁ దేనట్టివైన రాజులయొక్క యుదారచర్యలా ? ఆకCట మాఁడి మలమల మాడుచు నింటికి వచ్చి వంట సిద్ధము కాకుండినను భార్యపై గోపింపక కన్నులు మూఁతపడుచుండ విధిని ధ్యానించుచు నొక మూలఁ గూర్చుండు పొలము కాcపు యొక్క నడవడి యూ ? ఆహా ! జనసామాన్యము యొక్క ప్రతిదిన వృత్తములలో నెంత భావము, రసము, గుణము ఉపగతములై యున్నవో మన కవులకుం దెలియవుగదా ! రాజపుత్రులను, రాజ కన్యలను, చాలనందులకు బ్రాహ్మణులను, వేశ్యలనుబట్టి ఝుంఝూట మాడుటదప్పఁ గవితకు మేలైన యన్యకర్మములు లేవా?

                        సామాన్యజను లీ రీతి నలక్ష్యముగాఁ జూడబడుటకు హేతువు లెవ్వియన : ఈ దేశమునఁ బ్రజ సాధించుటకుఁ జేయి, తన్నుటకుఁ గాలు, మొఅవెట్టుటకు నోరు ఏదియు లేని పశువు ! ఐరోపాలోని జనులు రాజసగుణ శోభితులు. మన పాలిటి భాగ్యము తామస మో. దాని తోఁబుట్టువగు సత్త్వమో యేదో యెుక్ర జడత్వబీజము ! జాతి భేదములవలన శ్రేష్ఠకులులకు తదితర పక్షమున మర్యాదయు గౌరవమును గలుగమి శ్రేష్ఠులకు మాత్ర మర్ధింపఁదగినను నియతిని విద్య దాల్చినదగుట. దీనివలని దుర్దశలు రెండు. మొదటిది. విద్య నచ్చిన యుత్తమ వర్ణులకు తక్కినవారితోడి సాంగత్యము తక్కువ గావున వారింగూర్చి వ్రాయజాలినను వ్రాయ నేరరు. రెండవది. విద్యాదానమునకుం బాత్రమగాని జనబాహుళ్యము ఎంత దెలిసిన దయ్యును అక్షరములు రానిలోపంబున వ్రాయ నేరరు. అథవా ఒక రిద్దఱు కవితాశక్తి నెట్లో సంపాదించిరి పో ! ప్రాశస్త్యముననున్న పద్ధతి రీతిఁ జెప్పి యగ్రజాతివారిని మెప్పింపవలయునని గదా