పుట:Kavitvatatvavicharamu.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

62 కవిత్వతత్త్వ విచారము

ఈ విషయ మిట్లుండె. కథావిషయమున నుపజ్ఞయావశ్యకము గాదని గురువు చెప్పె. అతని శిష్యులనందగు తరువాత ప్రబంధ కవు లెల్లరు వర్ణనలంగూడ నుపజ్ఞ పనిలేదనియేమో, వసుచరిత్ర లోని యూహలన యనుసరించువారై బిల్ల వసుచరిత్రముల ననేక ములం బ్రకటించి, యాకార్యములందు రోఁత హెచ్చించి గురువు నకుం గూడ లఘుత్వ మాదేశమగునట్లు చేసి కవిత్వము భావ సంబంధము లేని పథసంబంధిగా నొనర్చి పాడునకుం దెచ్చిరి.

                                   ప్రబంధముల నాటక సరణి మృగ్యము
                           ప్రబంధములలో నాటక కౌశలము మృగ్యము. పాత్రోచితమైన భాష శ్లేషబంధురములైన కావ్యములలో మందునకైన దొరకునే ! చెలికత్తె నోరు దెఱచిన నేమి గన్యామణి నోరు దెఱచిన నేమి? బయట బడునది  ! శ్లేషయేఅంథును,అభంగశ్లేషను, ఘటింప వలయునన్న సాంస్కృతిక శైలి యుండియ తీరవలయును. ఏ రసము నే భావమును వెలయింపఁ బూనినను దీర్ఘ సమాసములతోఁ జేయుట విధి. ఏక సమానమైన వృత్తముల నేడ్చునప్పడును బ్రయోగించు కోమలాంగులఁ దలఁచుకొన్నచో వారి శ్వాసకోశము లెంత పునములని యాశ్చర్య మయ్యెడిని !
                                   ప్రబంధములకు దేశ క్షయమునకు గల సంబంధము
                      శ్రీకృష్ణదేవరాయల కాలములో విజయనగర మెంతో విఖ్యాతి గాంచి యుండెను. రాయచూరు మహాయుద్ధమున హిందువులు మహమ్మదీయుల నోడించి వారి రాజ్యములం బ్రవేశించి యడ్డులేని యధికారము వెలయించువారైరి. దేశమునఁ బౌరుషము దేదీప్య మూమాముగా నున్నందునఁ గావ్యములయందును నది ప్రతిఫలింపక పోలేదు. రాయల కృతమైన యాముక్తమాల్యద, మనుచరిత్ర, పారిజాతాపహరణము, కాళహస్తిమాహాత్మ్యము వీనియందెల్ల నవ్యత యను గుణమున్నది. మఱియు గొన్ని కొన్ని భావములు కవి నిండు హృదయంబుతో వ్రాసియుండుటయుఁ దేటతెల్లంబ.తాళికొట యుద్ధమున హిందువులు పరాజితులైరి. మహమ్మదీయులు విజయ నగరమును ధ్వంసముచేసి పాడుగోడలు తప్ప నింకెవ్వియు నందు నిల్పకపోయిన వెనుక దేశమున నరాచకము ప్రవర్తిల్లెను. చిల్లర పాళయగాండ్రు స్వతంత్రులైరి. విచ్ఛేదము దౌర్బల్యమునకు మూలముగదా ! అంతటితో హిందువులు మఱలనైనఁ బగసాధించి