పుట:Kavitvatatvavicharamu.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

60 కవిత్వతత్త్వ విచారము

వాదరములు. కేవలచిత్రకవిత్వము భాషతో జేయు కుస్తీ వంటిది. "భాషను ఎన్నివిధముల వంగదీసినాఁడు ! ఎన్ని బంధముల స్రుక్కించినాఁడు !" అను నాశ్చర్యమును బుట్టించును. నిజమైన కవిత గలిగించెడు నాశ్చర్యము వేఱు. ఏదన "సర్వజన వేద్యములగు సామాన్యములైన ఈ సంగతులు పదములు ఇత్యాది సామగ్రులఁ గొని యెంత యాహ్లాదకరమైన కృతిగాఁ గూర్చినాఁడు ! మనకు నా పదములు తెలియు (గదా ! సంగతులు దెలియును గదా ! తెలిసి యేమి కట్టుకొంటిమి !" అని చింతయు విస్మయమును దాల్చుట. దొమ్మరివాఁడు చేయు నద్భుతములను జూచి మనము చింతఁ దాల్పము. ఏలన, పరిశ్రమముఁజేసిన మనమును వానివలె సమర్ధుల మగుదుమను నమ్మిక గలదు గాన. తిక్కననుం దలంచి నపుడు నా బ్రతుకేలయని మన మను టెుంథులకు ! "దినదినము వాడు పదముల తోనే యతఁ డెట్టికూర్పులం బన్ని నాఁడుఇథి పరిశ్రమచే వచ్చు విద్య కాదు. స్వాభావిక ప్రతిభ. ఇంకొక జన్మ మెత్తినగాని యీడేరునట్టిది గాదు !" అను విచార ముద్బుద్దము గావుటచే.

                   వసుచరిత్రములోని కొన్ని పద్యములు చిత్ర కవిత్వముం జూచినఁ బాఱిపోవలయు ననువారి సైత మాకర్షించునంత రమణీ యములు. ఇంచుక యుదాహరణము జూపెద:
                    చ. చలిత లతాంత కాంతియను చందురు కావి చెఱంగుదాఁటి స
                        మ్మిళిత వయో విలాసముల మీటిన విచ్చు ఫలస్తనాగ్రముల్
                         వెలువడఁ గప్పెఁ దత్తణమ వేల్లితద్రోహద ధూపధూమకుం
                       తలముల విచ్చి దాడిమ లతాలలితాంగి నృపాలు చెంగటన్.
                                                                               (1 అ 164 ప.) 
                    సీ. ధరయే యపాంనుల తలచూపరాకుండఁ
                                        దనకూర్మి టేని నప్పననె ముంచె
                        సతియే యచండిక పతిఁ జట్టుకూఁతురై
                                        జగడాలు పచరించి నగముచేసె
                        కమలయే నిశ్చల రమణుపేరెదకు మో
                                       పైనిల్చి యతని పేరడుగుపఱచె
                         వాణియే మితసూక్తి వదలదు తలవాఁకి
                                       లి నిజేశుమాట మోచెననఁజేసె,
                      ఆ. ననుచు భూ కాంత శ్రీకాంత హరునికాంత
                           నజని  కాంతను నిరసించి  యా సిరంగ