పుట:Kavitvatatvavicharamu.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

56 కవిత్వతత్త్వ విచారము

యనివార్యమని యెంచితి మేని, కళాపూర్ణోదయము కేవల కవికల్పత మైన కథగావునఁ బ్రబంధములలో చేరనిదగును. ఈ బహిష్కా రము కష్టముగాదు! నష్టముగాదు! మఱి గొప్పతనమున కొక కారణ మనియు జెప్పవచ్చును. ప్రబంధములే మో నూతనమైన మహా సృష్టియని మనపూర్వులు భ్రాంతిఁ గొన్నట్లున్నది. కృష్ణదేవరాయలు మను చరిత్రకారుని "ఆంధ్రకవితాపితామహుc" డను బిరుదంబుతో బూజించెను. అనఁగా కవిత్వమును సృష్టి కి దెచ్చినవాఁడని ధ్వని ! అల్లసాని పెద్దనకుం బూర్వ మొక కవిబ్రహ్మ యుండె ఁగాని వానిని మన వారు మఱచిరో, స్థానభ్రష్టునిఁజేసిరో, లేక యొక్కొక్క మన్వంతరమున కొక బ్రహ్మ యేర్పడుట మంచి విభాగమని యెంచిరో! నాకుంజూడ ప్రబంధములును భారతాదుల గొంతవరకు ( బోలియున్నవి పరమాపూర్వములుగావు. ఎట్లన : ఈ రెండువిధములైన రచనల యందు . కథ ప్రాచీనము. భారతము మూలమునకు ప్రతి పదార్థ టీక గాదు. మఱి రససంపోషణార్థము కవిత్రయమువారు కొన్నియెడలఁ బెంచియు c గొన్నియెడల సంక్షేపించియు వ్రాసియున్నారు. ప్రబంధ ములు మాత్ర మేమియెక్కువ? నిజమే. వీనియందు వర్ణనలు బహుళముగ నున్నవి. పూర్వకవులు నాలుగు పద్యము లెక్కువ యను సందర్భమున వీరు నలువది యున్నను జాలదని ఘోషిం తురు ! ఈ మాత్రము పరిమాణ భేద మున్నంతనే వస్తు భేద మున్న దను టెట్లు? అనఁగా ప్రాచీనకవులయు మధ్యకవుల యు గ్రంథము లకు భేదములు లేవని నా తాత్పర్యముగాదు. మఱి ప్రబంధములు మూలరహితములైన యాదిమ విధానములు గావనుట. ఈ సృష్టి యందును ప్రాఁతవాసనలు లేకపోలేదు. ఇంక భేదముల వివర మెట్లనిన : ప్రబంధములలో కథ ముఖ్యము గాదు. మఱి వర్ణనలకు నవకాశ మబ్బుటకై తెచ్చిపెట్టుకొన్న నెపము. అనగా వర్ణనలు కథాసాంగత్యము లేనివనుట, సందర్భశుద్ధి లేనివనుటకు పర్యాయ వచనము. కథ ముఖ్యము గాక పోవుట మాత్రము గాదు. ఒకే యంత్ర శాలలోఁ జేయcబడిన సరకులవలె నీ కథలన్నియు నించుమించు ఏకస్వరూపముం దాల్చిన యవి. అనగా చర్వితచర్వణమునకు