పుట:Kavitvatatvavicharamu.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

54 కవిత్వతత్త్వ విచారము

లేదు గాన స్థిరీకరింపనేరము ! ఎదియెట్లుండె కవితాస్వర్గమునఁ ద్రిశంకుస్థితిం దాల్చియున్నాఁడు ! అయినను దల క్రిందుగా వేలాడుచుండలేదు. తల మీఁదుగనేయున్నది. కావున నెల్ల విధముల మనకు సంభావనీయుఁడు. తనకు శరణ్యులైన పభు వుల చిత్తవృత్తి ననుసరించువాఁడనుటకుఁ గళాపూర్ణోదయము నుండియే యొకదృష్టాంతముం జూపవచ్చును. చూడుఁడు. కృతి కర శైవుఁడు. దీనికి నితఁడు దార పుత్రాది బాధలేని యావన కాలేమ్లో వ్రాసినదని యూహింపఁదగిన రాఘవపాండవీయములో నితనిఁగూర్చి చిన వేంకటాద్రి చెప్పిన యీ పద్యమే సాక్షి: ఉ. దక్షతయింతగల్మి విశదంబుగఁ గాంచియు నీ మదిన్ ఫలా పేక్షఘనంబుగామి నిది యిట్టనగొంకెద నీకుపో లలా టేక్షణభక్తిశీల, రచియించుట కష్టముగాదె శ్రీవిరూ పాక్షున కంకితంబుగ శుభార్ధము రాఘవపాండవీయమున్. ఇఁక భర్తలైన నంద్యాలవారన్ననో వైష్ణవము కొంత ముదిరిన మహనీయులు ! "శ్రీ విష్ణుపదభక్తిచే ధర్మసంపత్తి ధర్మసంపత్తి చేతను జయంబు" వడసిన పుణ్యులు. అందును గృతిపతియైన కృష్ణమహీపాలుఁడు "మాధవ పదపద్మసమారాధన విధిసాధితా విరత భద్రుండు" ఇంతమాత్రమా; "విశ్రుత తిరుమలతాతాచార్య శ్రేష్టాన్వయ సుదర్శనాచార్య తనూజ శ్రీనివాసగురు చరణాశ్రయణ సమార్జితాఖిలాభ్యుదయుఁడు !" మఱియు "వైష్ణవమతశీలుఁడు" కావటంబట్టి రాఘవపాండవీయ ప్రభావతీ ప్రద్యుమ్నములలో శివ స్తుతితోఁ గావ్యారంభముం జేసిన భక్తుఁడు కళాపూర్ణోదయము విష్ణువునకు నగ్రార్చనంజేసెను ! మరియు మణికందరుని తీర్థ యాత్రను వర్ణించుచో విష్ణుస్థలములఁగూర్చి ప్రసంగించెఁగాని శైవ స్థలముల నంతగాఁ బొగడలేదు. అచ్చోట్లను, తక్కిన శాస్త్రముల నెల్ల నాకలించి "యువి యాత్మలమెచ్చని పాంచరాత్ర సిద్ధాంత విధాసమర్ధన సమర్థకృతార్థ మతి ప్రదీప్తలును" "శ్రీమహితాష్ట్రాక్షరీ జపమంత్ర పరాయణులును" "దేవతాఁతర చింతనావిదూరులును" నీతనికిఁ గానవచ్చిరేకాని, శైవసిద్ధాంత సమర్ధకులుగాని, పంచాక్షరీ జప పరాయణులుగాని యొకలైనఁ గంటఁబడలేదు. తుదకు వైష్ణవ మతము యొక్క ప్రధానతత్త్వమును బోధించుచు "లక్ష్మీనారాయేణ సంవాద"మును జూపి ప్రబంధమును ముగించెను ! పాపము ! దారిద్యముచేఁ గుందింపఁ బడనివాఁడెవఁడు; ఇట్లు యావనమున