పుట:Kavitvatatvavicharamu.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

 ప్రథమ భాగము 45

            బోవుట    పరమరహస్యమా ?    కావుననే  కదా   విద్యార్థు   లెల్లరుఁ    బరీక్షకులకును   వారి   పెండ్లాలకును     మనసులు    గల  పి  చల్లగ     నుండ    వలెనని    విఘ్నేశ్వరునకు    టెంకాయలు  గొట్టుట !
                      సర్వలక్షణస    మేతములుగా     వస్తువుల   నిర్దేశించుట  తప్పు

ఈ మనశ్శాస్త్ర తత్త్వము యొక్క యూదేశ మేమనఁగా , ఎట్టి సమ యములందును వస్తువుల సర్వసులక్షణములను వర్ణించుట గొప్ప యువ లక్షణము . మఱి భావముల ప్రసిద్ధి ననుసరించి విక్షేపముం దాల్చిన గుణముల నధికముగను , సంక్షేపము బూనినవానిని కొలఁది గను వర్ణించి, నిక్షిప్తములైనవానిం బేర్కొనక విడుచుటయు క్రళ ద్రు శ్లోభ . నిర్భావముగ వ్రాయుశాస్త్రకారుం డే విషయమును విడువక సమగ్రముగ వస్తుస్వరూపము నిర్దేశించెనేని వానికది చెల్లినవిధమే. ఎందుకన , వానియుద్ధేశము వేఱు . నిజస్థితిని నిరూపించుట వాని కర్మము . కవిపని యదిగాదు. మఱి భావము లను వికాసమునకుం దెచ్చుట . దృష్టాంతము  : వైద్యశాస్త్రము నభ్యసించువాఁడు మనుష్యుల దేహములోని ప్రతి సూక్ష్మవిషయ మును గ్రహింపఁగోరి సాంగోపాంగముగ లోపలివానిని పైవానిని సర్వమును బరీక్షించును . ఈ రీతినే మోహముచే నంధుఁడో , అర్ధాక్షియో , యే కాక్షియోరైన నాయకుఁడు తన నాయికను జూచె నేని యీ సూక్ష్మములపై నతనికి మనసు పోవునా  ? పోవచ్చునా ? అవి కంటఁడు నా  ? పడవచ్చునా  ? యోజింపుఁడు  ! యో జింపుఁ డనుట నా తప్ప ! దీర్ధాలోచనలేక యీ సంగతి నెఱుంగ నేరరను అనుమానమున్న మీరు మనుష్యులా కారా యను ననుమాన ముండక తీఱదుగదా  ! యోచన యేల  ? ఇది స్వతస్సిద్ధమైన భావము . రసికుల కెల్లరకు సామాన్యము . ఆది లేనివాఁడు శుద్ధ మృగమో జడుఁడో  ! కొన్ని శృంగార కావ్యములలో నాయకులు నాయికలను బాగుగ విమర్శించి సాంగోపాంగముగ సంస్మరణ చేయుట గలదు . ಅಲ್ಲು చేయుట యూ నాయికలను డాక్టర్ల దృష్టితో జూచినట్లు అనఁగా శవ సమానముగ జూచినట్లనుట ! కావున గద్యమైననుసరే పద్యమైననుసరే , కావ్యముల వర్ణింపఁదగినవి భావోదయము చేఁ బ్రకాశమునకు వచ్చు వస్తువుల కొన్ని కొన్ని రేఖలు , కళలు , పక్షములు మాత్రమే సర్వాంగ వర్ణనము భావభావనాశక్తులు సంపూర్ణముగ నింకిపోయిన పండిత మాత్రులు ప్రకృతిశాస్త్రజ్ఞుల యట్టు ఆలోచనాబలేముచే సాధించెడు