పుట:Kavitvatatvavicharamu.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

44 కవిత్వతత్త్వ విచారము

ఈ రెండు స్థితులకుఁగల భేదము వస్తువు దనంతట నెన్ని గుణములc దాల్చినదో యెవరు నెఱుఁగరు. లెక్కకు వచ్చునవి గోచరములు మాత్రమే. అగోచరము లుండినను నుండవచ్చును. మఱియు గోచరము లన్నియు వస్తువును జూచినపుడెల్ల మనకు స్ఫురించుటలేదు. ఏలయని యడిగితిరేని, ఏ భావము మనస్సున నుచ్చస్థానము నధిష్ఠించి యుండునో యా భావమునకు సమ్మత ములు, రుచికరములు, చింత్యములునైన గుణములు మాత్రము మిక్కిలి ప్రకాశమానములుగ నగపడును. తక్కినవి ముసురు గ్రమ్మినట్లు వెనుకcబడినవో యను గతి దూరస్థములైనవా యును మాడ్కిని స్ఫుటములుగా నుండవు. మఱి మా cగువాఱిన యవిగానో, ఆ సమయమున నేమాత్ర మెఱుకకు రానివిగానో యుండును. కారణమేమన, అప్పుడు వానిపై దృష్టినిలుపుట యగత్యముఁగాదు. సహజమును గాదు. దృష్టివేనిపైఁ బాఱునో యవి ముందువచ్చి సమీపమున నిలిచినట్లు విశదములుగ నుండును. పరిసరముల నుండినవి యస్పష్టములు. దూరముగ నుండునవి యప్పటికి నగోచరములు. ఆ భావము పోయి వేఱొక భావము మనస్సు నాక్రమించెనేని మునుపు తేజోవంతములుగా నుండిన భాగము లంతర్ధానమై, యప్పుడు గ్రహణము సోఁకినట్లు మఱుఁగుపడి యుండిన భాగములు ప్రజ్వలితమైన యుదయమం దాల్చినవి యగును. ఇందులకు వేఱు దృష్టాంతములేల ? చూడుcడు. కోపముగా నున్నప్పు డెదుటివాని దుర్గుణముల మీఁదనే యవధా నము స్థిరముగా వ్రాలును. శాంతముగ నున్న వేళ * వాని సుగుణ దుర్గుణముల రెంటిని గమనించి యూలోచనతో మంచివాఁడా చెడ్డవాఁడా యని నిర్ణయింతుము. మహానంద కాలములో నేర మొనర్చినవానిం జూచినను " ఏమో పాపము : కడుపాత్రమై దొంగి లించినాఁడు. ఇదియు నొక ప్రమాదమా ?" యని పరుషములకు సరళము లాదేశమగునట్లు చేయుదుము. భావమును బ్రేరేపింపఁ జేసినవారిమీఁదనే కాదు, తదితరులమీఁద సైత మారాగసహితమగు చూపు పోకమానదు. భార్యతోఁ గలహించిన వాఁడా మెమీcద మాత్రమే గుఱ్ఱని యుండునా ? మఱి చూచినవారినెల్లఁ గఱప


  • ఆలోచనాశక్తికి శాంతము మొత్తముమీఁద సహాయకారి. భావములు గొంతవఱకు విరుద్ధములు. శమదమాదిస త్త్వగుణములు పట్టువడినయెడల కైవల్య ప్రాప్తి యెట్లోగాని కవితాప్రాప్తి నిండుసున్న, రాజనతామసగుణములు కవితయను మందాకినీమనోహరప్రవాహమునకు జన్మస్థానములైన మహెూనృతభావములు.