పుట:Kavitvatatvavicharamu.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

 ప్రథమ భాగము 43

              చ.   కుడువఁగఁగట్ట బంధులకుఁ గోటివిధంబుల బెట్టజన్నము 
                    ల్నడుప ననేకధర్మ విధులం బొగడొందఁగఁ జాలునట్టి యె 
                    క్కుడుసిరియిచ్చి పేర్మినొక కొండగమన్చిన నీవు సావఁగా,
                   నొడలిటులో మితిం గురుకులోత్తమ ? యేనొక సేవకుండనే ?                    222
                కావున     వస్తువుల   నేకుల        కనేక       రీతులఁ     దోcచుననుమాయ      యొకటి మాత్రమే   కాదు,     ఒక్కనికే     కాలదేశ    వర్తమానంబులం    బట్టి  యు నేక    విధములఁ   దోcచుటయును   స్వభావ  ప్రభావమే  .  ఇక్ష డ   ఒక్కC  డంటిమి.    వాఁడుమాత్రము    వికార    రహితుcడా ?  కాcడు  మఱి మాఱుచుండు  వాఁడే  కావున  భావంబులు  ప్రసిద్ధి  గనుండు  నీ  లో  క్రము లో  నానావ  తార  సిద్ధియు విశ్వరూప   ప్రదర్శన శక్తియు    సర్వ    వస్తువులకు    సామాన్యములు    సహజములునైన    లక్షణములు.

ఆలోచన శక్తిచే నుత్పాదితములైన శాస్త్రముల యొక్కయు భావ బంధురములైన శిల్పముల యొక్కయు దృప్పలు వేఱు. గోచరించు పదార్ధముల తిరులును వేఱు . కావున నే శిల్పములు రచించుటలో స్వప్రతిభ ప్రకారము పో వలయు నే గాని యలంకార శాస్త్రజ్ఞులు , ప్రాచీనకవులు వీరిని ననుకరించుచు ప్రతికల్పనలం జేయఁజూచుట పాసఁగరాని మతమని మున్నే చెప్పబడియుంట ఏలకో మనకవు లీనాఁటికిని రుక్మిణీ పరిణయములు సుభద్రాపరి ణయములు వ్రాయుచుండుట . పాపము పెండ్లాడి పెండ్లాడి వార లలసి సొలసి విసుగెత్తియున్నారు . వారికి (పించన్ ) విశ్రాంతి ప్రతిపాదింపకున్న నెంతయు ఫెూరము. శాస్త్రములలో నొకఁడు వ్రాసిన సిద్ధాంతముల నితరులును గ్రహించి ప్రచురింప వచ్చును. అది పునరుక్తి దోషంబు గాదు . కళలలో నుపజ్ఞలేనిది స్వారస్య ముండదు . భావముల ననుసరించి యాకృతులు వివిధభంగు లC దోcచుననుట స్ఫుటముగదా ! అనఁగా శిల్పులచే నారాధింపఁబడు సిద్ధియేదన నున్నది యున్నట్టు ప్రదర్శించుట గాదు. మఱి కన్నది కన్నట్టు ప్రదర్శించుట . ఉన్నది యున్నట్టు , అనఁ గా వస్తుస్వభావ మేర్పడియున్న భంగియనుట . ఇcక కన్నది కన్నట్టన్ననో , మన భావముచే దాని స్వభావము చెందిన వికారముల ప్రకారము అనుట . అనc గా నిరవధికస్థితిగాదు . మఱి భావమును అవధిచే నిర్ధారితమైన స్థితి.”


  • తత్వజ్ఞలనేకులు భావాతీతమైనస్థితియుండియు లేనట్లే గాన మిథ్యయని

వక్కాణించెదరు. నిజస్థితియనునది వస్తువుయొక్కయు మనుజులయొక్కయు ప్రకృతులు రెంటిచేతను నిర్ధారితము. o