పుట:Kavitvatatvavicharamu.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ప్రథమ భాగము 41 నిమిష నిమిషమునను వృద్ధిబొందునట్లు దోఁచుచుండును. వీనికిని ఆవేషము వృద్ధిబొందుట తప్పదు. "రాజు మెచ్చినదే రంభ" అనగా ననురాగముండు నేని ఎవరిమీఁద నాయను రాగము వ్యాపిం చునో వారు, తదితరుల కెంత కురూపులుఁగ గానవచ్చినను, వానికి మనోహరమూర్తులుగఁ గానుపింతురు. అట్లగుట యెంతయు మేలు. ప్రతివాఁడును మోహముకొలఁది సర్వోత్కృఘ్టరాలని భ్రమించి యెవతెనో యొక స్త్రీని వశ్యముచేసికొనఁ జూచుట యీ న్యాయము యొక్క మాహాత్మ్యమే. ఈ ధర్మము, మనుష్య ప్రకృతిని బాలించు చుండదేని, నిర్భావముగానే పక్షపాతము లేక యెల్లరు నే స్త్రీని నుత్తమురాలని నిర్ణయింతురో దానినే యందఱు వలచి సుందోప సుందులట్లధోగతిం జెంది యుందురేమో ! భావముల యొక్క దృష్టికిని ఆలోచనా శక్తి యొక్క దృష్టికిని ముఖ్యమైన భేద మేమనగా ; యోజనా శక్తిం బట్టి నిరూపించితిమేని సత్యమొక్క టియే. అనగా సిద్ధాంతీకరింపఁడిన తత్త్వము సర్వజనులచే సరియని యొవ్పకొనఁబడియే తీరవలయును. దృష్టాంతము గణితశాస్త్రము. ఏడును పదితో గుణించిన డెబ్బది యగుననుట నిర్వివాదము. ఎవండైనను నాకీమాట రుచింపదని యనినచో వానిని బిచ్చివాఁడందుము. కాని గోచరములయెడ భిన్నభావము లున్న నది పకృతి విరుద్ధమని యెవరుఁ జెప్పరు. కావుననే "లోకోభిన్నరుచి" యనుసామెత. "ఎట్టి సౌందర్యవతియైన నేమి? లోకములోని వారెల్ల నా మెయందే బద్ధ మోహులు గావలెను . ಅట్లు చేయనివారిని బిచ్చి యాసుపత్రికిఁ బంపక తప్పదు " అని సిద్ధాం తముఁ జేయc బిచ్చివాఁడు దక్క నింకెవఁడైనఁ గడంగునా? కావున శాస్త్రములలో నేక కంఠముగా నెల్లరును ఇది సత్యము తక్కినవి మిథ్యలు, అని స్థిరీకరించునట్లు కళలలో c జేయఁజూచిన రసా భాసము నిత్యము. ఒకేవస్తువు మానవుల ప్రకృతులంబట్టి యనేకు లకు ననేక భావముల కాస్పదముగావచ్చును. మఱియు భావము లంబట్టి కొంతవఱకును రూపమేర్పడును, గాన ననేక రూపములం దాల్చినదియు నగును. నానారూపమునం జెందియుండుట యొక్క భగవంతునికే చెల్లిన భాగ్యముగాదు. అతని సంతతివారముగాన మనకును నందు భాగముగలదు. భారతములోని దుర్యోధనునిఁ గూర్చి విచారింపుఁడు. ధృతరాష్ట్రుడు, అనుజులు, సచివులైన కర్ణాదులు, ప్రజలు, పాండవులు మొదలగు వివిధపక్షములవారిలో నొక్కక్కరి కొక్కొక్క యువతారముగ నాతఁడు దోcచలేదా. (6)