పుట:Kavitvatatvavicharamu.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

40 -- కవిత్వతత్త్వ విచారము సొగసుకత్తెయని వ్రాయువారికి శిల్పముయొక్క తెఱంగను వాసన యేమాత్రమైనఁ దె లియునని వచింపనౌనా ? సీతమ్మ ముక్కు సొగసన్న నర్థమేమి ? సీతమ్మయొక్క ముఖము మొదలగు నవయవములతోఁ జేరిక కల్గియుండుటచే, ననఁ గా "నా స్త్రీయొక్క యాకారముం బట్టి, యది చక్కనిదనుటగాని, యా ముక్కును గోసికొనిపోయి యింకొకచో నుంచినను నదేరీతి సొగసుగానుండునని యర్థము కాదు.

“తమ తమ నెలవులఁ దప్పినఁ
దమ సాగనులె రోఁతలగుట తత్ద్యము సుమతీ !

కావున నంగీకారములేని వర్ణనలు ప్రత్యేకముగ నెంత యద్భుతములుగా నున్నను నింద్యములే. కథయను నిండుటా కృతిని దీర్పఁజాలని కవి యంగములవంటి వర్ణనములఁ దీర్ప నేర్చుననుట పిచ్చికూఁత. కావున విమర్శనముఁ జేయుటలో కథ, పాత్రములు, ప్రకృతి విశేషములు, వర్ణనములు ఇవన్నియుఁ బర స్పరమైత్రికలిగి విఱుపులులేని యే కాకృతిగా నున్నవాయను విచా రణ ప్రధానతమమని నా మనవి. కథయొక్క గమనమునకు విరోధ మైన దీర్ఘ వర్ణనముంజేయుట రసవిహీనభావమున కొక గుఱుతు. భారత రామాయణ హరివంశాదులలో నీలో పము లేశమాత్రము గానము. ఇప్ప డిట వివరింపఁబడిన న్యాయము గోప్యముగాదు. చదువరులెల్ల నెఱి గినదే. స్వబావవర్లన యనుటకు నిర్వచనము పకృతిసమ్మతమైన వర్ణనము అనుమాటకు నిర్వచనము ఉన్నది యున్నట్టు చెప్పుటగాదు. ఏలన గవర్నమెంటువారి గెజట్టులో జరిగినవి జరిగినట్టు వృత్తాంతములు ప్రకటింపంబడును. అది కారణముగ నా వ్రాఁతలు స్వభావో క్త్యలంకారమునకు దృష్టాంత ములని యెవ్వఁడుఁ బేర్కొనఁడు. వస్తువుల నిజస్థితి నిర్దేశించుట శాస్త్రముల యీప్సితము. కళ యొక్క కాంక్ష యది గాదు. ఎట్లన, కళలలో ప్రధానమైన పురుషార్థము రసము. రసము భావమునకు సంబంధించినది. భావము ఆ పరమైన దృష్టితోగణించి వర్ణించు టయే కళ యందు శ్లాఘనీయమైన పద్ధతి. భావముతోఁ జూచుటకును భావము లేక చూచుటకును నెంతో భేదము. ఉదాహరణము : సుందరియగు నారీమణినిజూచి యువ్విళ్ళూరు వానికి నా మె సాగసు