పుట:Kavitvatatvavicharamu.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ప్రథమ భాగము 37

ఉ. హాయును ధర్మరాజ తనయా యను నన్నెడఁబాయ నీకుఁ జ
న్నేయను దల్లినేఁపఁ జనునే యనుఁ గృష్ణుఁడు వీఁడె వచ్చె రా
వే యను నొంటిపోక దగవేయను నేగతిఁ బోవువాడ నే
నో యభిమన్యుఁడాయనుఁ బ్రియోక్తుల నుత్తర దేర్పవేయనున్”
                                                          (భా. ద్రో. ద్వి. 242)

అని విలాపించిన సామాన్య పద్యముం జూచి తరువాతి కవు లందఱు నా క్రోశావసరంబులలో

ఉ. "రాయనుఁగాయనుం దొగలరాయనిఁగేరు నిగారపుంగొటా
రాయను మేటినాడెపు దారాయనుఁ గిన్క యొనర్చెదేమిమే
రాయను నింతనీకుఁ గనరాయను దయ్యము పాడిదప్పెనా
రాయనుఁ గన్నవారు నగరాయను నిప్పని మానురాయనున్”

  • {అచ్చ తెన్లు రామాయణము అయో. 89 ప.)

ఉ. కాయను మేటితప్పు కొడుకాయను నిద్ధపుబూతమావిమో
కాయనుఁ బంజరంపుఁ జిలు కాయను నబ్రపుసోయగంపు బ్రో
కాయనుఁబల్కవేమి యలు కాయనుఁ బంతముదీఱెనోటుకై
కాయను నేరయిట్లు దుడుకాయనుఁ బాయఁగఁ గోరికాయనున్

(ఆచ్చ. రా. అయో. 90 ప.)

ఉ. హాయను గాధినందన మఖారినిశాటమదాపహారిబా
హాయను గ్రావజీవదపదాంబురుహాయను రాజలోక సిం
హాయనుఁ బోషితార్యనివహాయనుఁ గానల కేగితే నిరీ
హాయను నిర్వహింపఁగలనా నినుఁబాసి రఘూద్వహాయనున్.

(రామాభ్యుదయము ఆ. 5 ప. 10)

ఉ. జాయనుజూపవేమి యనుజాయను నవ్విధియెంత చేసెనౌ
రాయను నాదుగుండె బలురాయను నాత్మపరాక్రమోన్నతుల్
రోయును గాననాంతరము రోయును దుష్టకురంగచేష్ట ను
మ్మాయను జానకీ దనుజమాయను గ్రుంగితె పల్కుమాయనున్

. (గ్రామాభ్యుదయము, సీతావిరహపుట్టము)

ఇత్యాది వర్ణక్రమము ననుసరించి ప్రాసములతో వ్రాసిన రసికుల మనసులకు తూయనిపింపక మానునా ?

మిశ్ర చరిత్రములుగాని పాత్రములు ప్రకృతి విరుద్ధములు పాత్రములం గూర్చి యీవఱకు స్థాపింపఁబడిన పద్ధతులు