పుట:Kavitvatatvavicharamu.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

36 కవిత్వతత్త్వ విచారము -మర్యాద కాదు. ఈ గుణములంబట్టి చూచిన రామాయణాదులు భారతమునకంటె నెంతో తక్కువయునుట నిస్సంశయము. ఇఁక సామాన్య ప్రబంధములన్ననో పొనియందలి స్త్రీ పురుషు లెండిన కట్టెలవలె నున్నారు. వంగలేర్చ, పెరుగలేరు. కాఁబట్టి ప్రాపులు రెండు : విఅువఁబడుట! ప్రాయి నిడఁబడుట. శాస్త్రాడేళ రచనలు విరసములు ప్రాచీనులు వ్రాసినట్లును అలంకారశాస్త్రము లాదేశించినట్లును విరచింపఁ బ్రయత్నించుట తెలివితక్కువ పని ఏలన ఒక కవి వ్రాసినవిధమున నింకొకఁడు వ్రాయcజాలమి ప్రకృతిసిద్ధమైన యర్గళము, ఇందునకు గారణములు, (i) మనసులు వేఅగుటం జేసి భావాదులును వేఱు. వివిధ భంగుల స్ఫురణము గల వారు ఒకేతీరును నభినయింపఁజూచుట పరిహాసమునకు హేతువు. (ii) భావము భాష యివి పరస్పర సాంగత్యమం దాల్చి యున్నవి. ఇంచుక నిదానించి చూడుఁడు. ఏవిధమైన పదములచేరికయు లేని యాలోచనలజేయుట సాధ్యమౌనా? ఏదీ ? భాషాసాహాయ్య మేమాత్రముఁ గైకొనక కొంతసేపు దేనినిగూర్చిమైన యోజింపుఁడు? ఈ గారిడీవిద్య మనుష్యులకు మించినది. తలపండిన భాషయు నుండవలయుననుట నిజము. అయినను భాష యుండినఁ దలం పండితీరవలయు నా యను నొక ప్రశ్నయు విచార్యము. భావము ల ఖండముగ లేక యుండినను పదాడంబరము c బ్రబలముగాc జూపవచ్చుననుటకు మన ప్రబంధకవులే సాక్షులు కాని, యట్టి పదములు నిరర్థకములుగాన హృదయాకర్షకములు గావు. రుచి నీయవు. భావపుష్టి లేని పదపుష్టి కి 'బడాయి శైలి' యని పేరు. పసిపిల్లలేగాని ధీరులెవరును దీనినొకయెత్తుగఁ బాటింపరు. కావునఁ దిక్కనరీతిని వ్రాయవలయునన్నఁ దానే తిక్కనావ తారమెత్తి యాతని మనోభావాదులఁ దాల్చిన యానుగాని విరాట పర్వము గ్రుడ్డి పాఠముఁ జేసిన గోరిక తుదముట్టదు. ఒకరు సృజించిన శైలి, విషయము, రీతి. ఇత్యాది బింబములకు ప్రతి బింబముతe రచింపఁజూచుట మంచిదిగాదు. అదృష్టవశమున సాధ్యమునుగాదు. కష్టించి బహిరాకారముఁ దీర్పఁజాలితి మేనియు నంతరంగ ప్రతిపాదనముం జేయుట యెట్లు? ప్రాణము అను గుణములేనిపాత్రములు రిత్తలు. ద్రోణపర్వములో నభిమన్యు మరణవిమయమై జాలిఁ జెందుచు వరమఁడు