పుట:Kavitvatatvavicharamu.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

34 కవిత్వతత్త్వ విచారము

   బిజికిపట్టుతోఁబట్టి వానిసంఖ్యలకు గుణకారము సేకూర్చిన నలం కారము సేకూరునని ఆంథ్ర కవిత్వమును భావములేని పదా టోపము ప్రకటించి పాడు సేసిరి."                 
ఏమీ! ప్రతివాని మనసునకు వచ్చినట్లు వ్రాసినదియుఁ విత్వమగునా? యను నా క్షేపణ ముండునేమో! నేనన్నదది కాదు. కవియైనవాఁడు తన భావము ప్రకారము వ్రాయవలయు నంటిని గాని, భావము ప్రకారము వ్రాసిన వారందఱు గవ లౌదురని నా మాటగాదు. అనఁగా నుత్కృష్టమైన భావములేని నీరసమానసులు కవిత్వముం జేయంబూనుట వారియొక్కయే కాదు మన యొక్కయు దురదృష్టము.                 
                   పాత్రములు అనితరతుల్యములుగ నుండవలయు  
            

సుప్రసిద్ధములైన పాత్రములన్నియు ననితరతుల్యములు. మఱియు ననితరతుల్యములే సుప్రసిద్ధములు. ఉదా. : ద్రౌపది సీత, సావిత్రి, శకుంతల, మండోదరి, శూర్పణఖ మొదలగువార ఎల్లర చిత్తములలోను జక్కఁగాఁ దమ తమ గుణములచే బ్రకాశ మానలుగ నున్నారు. వీరిలో మంచివారు సైతము భిన్నమూర్తులే కాని, ప్రత్యేక పఱుచుటకు సాధ్యముగాని యొకే యచ్చునఁ గొట్టినట్టి బొమ్మలు గారు. ఇఁకఁ బ్రబంధ స్త్రీలన్ననో యట్లుగాదు. అందఱకు నొక కేుమూర్తి. వెవ్వేఱ గుర్తింపనలవిగానట్టిది. ఆ కారములు, గుణ ములు, చీరలు, నగలు అన్నియును నలంకార శాస్త్రమను నొకే యంగడిలో నెరవుతేఁబడిన వస్తువులు. పేర్లు మాత్రము వేరు. చర్య లేమో యొక్కటే. అవియు నంత శ్రేష్టములు గావు. వ్యక్తిత్వము సున్న. ఆదికవులను మధ్యకవులనుగూర్చి చెప్పిన యీ కవి మాటలు దిక్ ప్రదర్శనముగఁ జెప్పబడిన వేకాని ప్రతియొక్క కవికి నా రో పింపఁదగినవి కావని యెఱుంగవలయు. చూడుఁడు. స్త్రీపాత్రములందు మనుచరిత్రములోని వరూధిని యెంత మనో హారిణియగుముద్దరాలు !

                             జీవకళ యొక్క లక్షణము      
      పాత్రములు ప్రత్యేకాకృతులుగ నుండవలయు ననుటయ:య్యవి బిఱుసువాఱినట్లుండక సమయోచితము లగు మార్పులంజెందునవిగ నుండవలయు ననుటయు C బరస్పర మిత్రములైన