పుట:Kavitvatatvavicharamu.pdf/205

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

198 కవిత్వతత్త్వ విచారము

కిచకుని ప్రత్యుత్తరము :

సీ. గండు మీలకుఁ బుట్టి కాముబాణములతో
గలసి యాడెడు నట్టి కన్నుఁ గవయు
బినకాండముల శిక్షఁబెరిగి లేఁదీఁగల
మెచ్చకయున్నట్టి మృదుకరములుఁ
జిగురులతో సంధి సేసి యంబుజముల
పైనెత్తి చనునట్టి పదతలములుఁ
గలకంఠముల చేతఁ గఱచిన విద్య వీ
ణలకిచ్చునట్టి తిన్నని యెలుంగు
నత్తెరంగున రేఖయు నవ్విధంబు
గరువచందంబు నమ్మెయి కలికితనము
నట్టి చెన్నను సైరంద్రియంద కాక
కలవె యొరులకు నెఱుఁగక పలికి తబల !

(ఆ. 2, ప. 67)

కీచకోత్కంఠ :

సీ. లీల నాముందట నాలేమ వొలసినఁ
జూడ్కికిఁ జుబ్బన చూర్జిగాదె
కనువిచ్చి నన్ను నాతనుమధ్య సూచినఁ
దనువున కమృత సేచనముగాదె
చిరునవ్వు బెరయ నచ్చెలువ నాతోడఁ బ
ల్కినఁ జెవులకు రసాయనముగాదె
యెలమి నన్నెలఁత నన్నెలయింపఁదివిరిన
నెడఁద కానందంబు నిక్కగాదె
యానితంబిని మక్కువ ననఁగి పెనఁగి
యింపు పొంపిరి వోవ నన్నేలుకొనఁగఁ
దలఁచి పొందిన నది జన్మఫలముగాదె
యనుచు వలరాజు బారికి నగ్గమయ్యె.

(ఆ. 2, ప. 86)

కీచకు దర్శనంబున ద్రౌపది యవస్థ :

సీ.దైన్యంబు తలపోఁతఁదలకొన్నఁ జెలు వ కా
ననమున వెల్లఁదనంబుగదిరె
భయరన వేగంబు పైకొని ముట్టినఁ
గాంతకుఁ దనులతఁ గంపమడరె