పుట:Kavitvatatvavicharamu.pdf/204

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తృతీయ భాగము 197

చెలువ యింక నొక్కించుక సేపు నీ వ నాదరంబున నెప్పటి యట్లయున్న మన్మథుఁడు సమయించిన మగుడనన్నుఁ బడయవచ్చునె యెన్ని యుపాయములను.

                                                          (ఆ. 2,ప. 4)

కీచకుఁడు ద్రౌపదిని ముఖస్తోత్రము చేయుట :

సీ. నెత్తమ్మిరేకుల మెత్తఁదనముఁదెచ్చి
యచ్చునఁ బెట్టినట్లంద మొంది
చక్రవాకంబుల చందంబుఁ గొనితెచ్చి
కుప్పలు సేసినట్లోప్పమెఱసి
చందురునునుఁగాంతి కందేర్చి కూర్చి బా
గునకుఁ దెచ్చినయట్లు కొమరు మిగిలి
యళికులంబులకప్పఁ గల యంతయును దెచ్చి
నారు వోసిన భంగి నవక మెక్కి
యంఘిర్తలములు గుచములు నాననంబుఁ
గచభరంబును నిట్లున్న రుచిరమూర్తి
యనుపమాన భోగములకు నాస్పదంబు
గాదె యీ త్రిప్పలేటికిఁ గమలవదన.

(ఆ. 2,ప. 52)

సుధేష్ణ కీచకుని మనసు మరల్పన్ గోరి చేసిన కాంతాజన వర్ణనము.

సీ. లలితంబులగు మట్టియల చప్పుడింపార
నంచకైవడి నడనల్లవచ్చి
యెడమేనినెత్తావి సుడియంగఁ బయ్యెద
సగము దూలించిపై మగుడఁ దిగిచి
సోలెడు నెలదీఁగె లీల.c గ్రాలుచు వింత ..
చెలువంబు దలకొనఁ జేరినిలిచి
తెలిగన్నుఁ గవకు నెచ్చెలియైనలేఁత న
వ్వొలయంగ నరసంపుఁ బలుకు పలికి
మెఱయు చెయ్వులరాగంబు మెయికొనఁగ
నెడఁద సాగయించుమాటల నెలిమి మిగుల
నిన్ను ననురక్తిఁ గొలుచు నన్నెలఁతలుండ
నీరసాకార సైరంద్రిఁ గోరఁదగునె.

(ఆ. 2, ప. 64)