పుట:Kavitvatatvavicharamu.pdf/198

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

 తృతీయ భాగము 191

            ఈ యా శ్వాసము లంగూర్చి విక్షేపముగఁ జర్చించుటకు నా కిష్టములేదు. సామాన్య ప్రబంధముల ಯಿಟ್ಟು ಲ యువి నిరర్థక పద్య పూరితములు. కల్పనాశక్తి యే దిక్కునఁ బోయెనో ! సంభాషణ చాతుర్య మెందు గ్రుం కెనో ! ప్రతిభ యెటుమాయమా యెనో ! అలంకారాది శాస్త్రములయందలి మూఢభక్తి పటుతమము !
                       తుచ్ఛశృంగారములకు హేతువులు
       స్త్రీ వర్ణన చేయుటకు మనకవులకుఁ దెలియదు గాఁ బోలు ! కారణ మే మన ఇంటిలో నుండు రసములు జిహ్వకేగాని మనసునకు వికాసము నిచ్చునవిగావు. బాల్యవివాహము, విద్యావిహీనత ఇత్యాది దురాచార హ తులగుటుంజేసి యిల్లాండ్రు సరసములకుం బనికి రారు. ఇCక సరసములకుఁ దగినవారు దానిని జీవనోపాయవృత్తిగా నాశ్ర యించెదరు. వారి యందు మఱుఁగు, మా నము, జంకు, మర్యాద మొదలగు నుదాత్తగుణంబు లల్పంబులు. ఎట్టి హీనలయ్యుఁ గుల కాంతలకన్న మేలగుటంబట్టియే మొ వారికి • భోగము వారు' అను పేరు గలిగె, తక్కిన యాcడువారు భోగమునకుం దగరు. వారిం బ్రేమించుట దానధర్మము. జన్మపరిత్యాగతుల్యము !
                             భారత కవుల శృంగార వర్ణనము దివ్యము
           పచ్చిపచ్చిగా వ్రాయుట శృంగార మెన్నఁటికిఁగానేరదు. మహాకవుల శృంగారవర్ణనములో శృంగారము, శుచిత్వము సమ న్వితములు. ఆంధ్రకవ లద్దానికి విరుద్ధంబగు భ్రమ నేల దాల్చిరో ! ಅಲ್ಲು చేయుటకుఁ గారణములేదు. ఏలన, ప్రామాణిక కవులగు కవిత్రయము వారు మంచిత్రోవను విభావించియుండు కతనమున. భారతములో గోప్యాంగవర్ణన శృంగారమునకై యెక్కడను జేయఁ బడియుండలేదని తోఁచుచున్నది. నిదర్శనముగా
                                          నన్నయభట్
                  ఆదిపర్వములోని శృంగారపద్యముల వినుఁడు.
                 సీ. పలుకులముద్దును గలికి కాల్గన్నుల
                                                తెలుపును వలుదచన్నుల బెడంగు
                     నలఘు కాంచీపదస్థలముల యొప్పను
                                           లలితాననేందు మండలమురుచియు