పుట:Kavitvatatvavicharamu.pdf/197

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

190 కవిత్వతత్త్వ విచారము

               తే, అతివ తొడలును జపునంబు నరసి చూడఁ
                    గొమరు మీ బ్రెడు జమిలితొండముల శిరసు
                      తోడి వలరాచవారి యద్భుతపు హస్తి
                        యగ్రభాగంబు చూపఱ కాత్మఁ దోఁప. 135
               చ. జలజ దళాయతాక్షి మృదుచారుతర ప్రపదద్వయీ విని 
                   ర్మలరుచి పుల్లుపుల్లుమను రత్నప్పటందెల మోఁత జృంభణం
                   బుల నవకంపుఁ గచ్ఛపము పొల్పునదల్పుచు గెల్పుఁ దెల్పెడున్
                    గలుగునె యింక దీనికి జగంబులలో నుపమా ప్రసంగముల్. 155
         ఇత్యాది. ఈ పద్యములం బట్టి విచారింపఁగా నేర్పడిన విషయములివ్వి : రాజు గారి దూరదృష్టి బలము. అంగనామణి చీర యే మాయెనో ! ఆ పె గిర్కీలు కొట్టుచుండెఁ గాఁ బోలు ! లేకున్న నన్నిభాగములు గనుపడునా ? ఈ యుపమ లెందునకుఁ బనికి రావనియు, రోతలనియు వేఱుగఁ జెప్పవలయునా ? వీని క్రిం గారకము భావనాశక్తిగాదు. మఱి సామ్యశక్తి. అందులోను గుయుక్తి, కాముకుఁడఁట ! తాళలేనివాఁడట ! ఆలోచనాశక్తిచేఁ తట్టనట్టి పదునెనిమిది పద్యములు గొణ (గె నట ! రసాభా సమన ס: יה నిదియే గదా !
         ఈ పాండిత్య మంత్రములు ముగించిన పిదప చెలికత్తెలువీరొక తడా బ్లూ - ఆ పెకుఁ గరణియముల బోధించి, కళాపూర్ణుని "చరణంబు విలాసిని యూరువులందుఁ జేర్పఁజేసి బలిమి నావనజ ముఖి చేతఁ బట్టించి సంవాహన మొనర్పఁ జేసిరి". ఇది శుద్ధముగ అనావశ్యకము అసహ్యమును !
        అయ్యో ! మృగప్రాయ శృంగారమా ! ఈ చెలికత్తెలు మన్మ థుని పురోహితురాండ్రు !
        ఈ యోడారు వంటి కవిత్వములో,
            తే, వరునిచిట్టంపుఁ జేఁతలఁగరము ప్రేమ
                మెఱుప్పవోలెఁ దళుక్కున మెఱయుఁగాని 
                 నెలఁత సిగ్గను మొగిలులో నిలువలేద
                 యిదియు మిక్కిలి నింపయ్యో నతని మదికి.
                                                                    (కళా. ఆ. 7, ప. 154)
అని పద్యముమాత్రము సూరన యొక్క నైజప్రభావమును సూచింపఁ జాలినంత రమణీయముగానున్నది. తక్కినవి భావ