పుట:Kavitvatatvavicharamu.pdf/195

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

 188 కవిత్వతత్త్వ విచారము బప్పనుంబలె నంగడిలో c బెట్టి విక్రయించుట యీ కర్మభూమి యొక్క మహాధర్మము ! కళాపూరుఁడు మధురలా ల సను బెండ్లి యాడుటకై యభినవ కౌముదమ్మగారి యనుమతిని దానే కోరుట లేదు. రాయబారులను బంపుచున్నాఁడు ! భార్యాభర్తలకును మధ్యస్థమా ? ఏమీ ! భార్యకు పురుషుని పడుకలోనేగదా పాలు ! మనసులో లేదుగదా ! అభినవ కౌముదికి సరేయనుటదప్ప నింకే స్వాతంత్ర్యమున్నది ! వివాహము తటస్థమయినది. శుభకార్య ములో "పెద్దపూ (బోండ్లు" రాకపోకలు చేసిరట. ఎంత ముసలి వారైనను పూఁబోండ్లే ! శైలియు వ్రాలుచున్నది. పెండ్లియైనది.

                                           అసహ్యశృంగారము
         వధూవరు లే కాంతము గోరుచున్నారు. చెలికత్తెలు గొంచె మున వదలరు. కవియన్ననో యీ సమయమునఁ బ్రాణముఁబోయి నను వారిని వదలఁబోఁడు ! ప్రథమ విఘ్నము తల్లి. అవసరముగా వెళ్ళుచుండఁగా కూ (తును నిలఁబెట్టి యూ పెకు బుద్ధివచ్చునట్లు ఇచ్చిన యుపన్యాసము ఒక గంట దీర్షము ! అంగనామgటికి తాల్మి లేనితమిచేఁ గలిగిన తబ్బిబ్బులఁజూచి జరగఁబోవు తమాషాలం దలంచి, చెలికత్తెలు హాస్యముఁ జేయుటలో వినియోగింపఁబడిన కాలము అరగంట. అలంకార రచనాదులకుc బట్టిన కాలము 2 గంటలు ! 
     ఒకటి. నిష్కారణముగ మధురలాలస "విభుండిఁక వచ్చు టెప్పడొకొ విఘ్నము లేమయినన్ ఘటిల్లునో" యని తన కే ద్రోహముఁ జేయని యభినవ కౌముదిమీఁద దోషారోపణ కుం దొడఁగు చున్నది ! ఈ యమ్మ దౌర్భాగ్యపు విరాళిని కలభాషిణి యొక్క యుదారచరితంబుతో నుపమించి చూడుఁడు ! పిమ్మట "మెడికల్ ভ০ তত্তে ప్రొఫసర్ల" రీతిని పురుషుని శరీర భాగముల వర్ణించు చున్నది ! చాలీచాలని దానికి తన పరువేర్పడునట్టు బాగుగ విడఁదీసి యాడెడుమాట వినుండు !

“ తే. ఆ లలిత చరణములొత్తు కేలుగేలు

                      కోర్కిఁ దద్వక్షమునఁజేర్చు కుచము కుచము 
                       దివుట దద్రహఃకథ విను చెవులు చెవులు
                      పలుకులేల తద్రతిఁగన్న బ్రదుకు బ్రదుకు.”