పుట:Kavitvatatvavicharamu.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

జీవితముతో నివి కరతలామలకము గావించుచున్నవి. అందుచే రెడ్డిగారి విమర్శన స్వరూపమంతయు నీ ప్రకరణ ద్వయ దర్పణ మునఁ జక్కఁగాఁ బ్రతిఫలించుచున్నదని చెప్పవచ్చును.

రసములలో నెల్ల శృంగారము మిన్నయై సంస్కృతలక్షణ గ్రంథములం దెక్కువ భాగమాక్రమించి యున్నది. అట్టి ప్రధాన రసమును సూరనార్యుఁ డైదువిధములుగా వర్ణించుటను జూపి, యందు నాలుగు విధముల శృంగార . మతిమనోహరముగాఁ గళా పూర్ణోదయమున నెట్లు కనవచ్చుచున్నదో యీ విమర్శనము దెల్పు చున్నది. స్త్రీ పాత్ర పోష బౌచిత్యమునకు లక్ష్యముగా నిడి కల భాషిణీ పాత్రమును బహుభంగుల వివరించు చున్నది. సుగాత్రి శాలీనుల కథయందలి చమత్కృతి నిది యరఁటిపండొలిచి చేత బెట్టినట్లు చూపుచున్నది. పెక్కేల నూరనార్యుని రెండు ప్రబంధ දී ාප ට ෆ්ෆ ముఖ్యాంశముల నెల్ల నిది యుక్తియుక్తముగా ననుభవ సిద్ధముగా విమర్శించి నిష్పక్షపాత విమర్శనమునకు దారిచూపు చున్నదనుటకం కేు దీనిని గూర్చి యిందధికముగా వ్రాయుట యనా వశ్యకము.

కడపటి ప్రకరణమం దసహ్యశృంగారము, కళాపూర్ణోదయము కడపటి కథ, అందలి యనౌచిత్యము మొదలగు విషయములు పరిశీలింపఁబడినవి. సుగాత్రీ కలభాషిణీ పాత్రపోషణమునకును మధురలాలసా పాత్రపోషణమునకును గల భేదమును జూపి యందలి యాచిత ని, యందలి యనౌచిత్యమును విశదీక రించుటయె విమర్శకులు సూరనార్యు నెంత గౌరవబుద్ధితోఁ జూచి నను, ఆతని రచన యందలి గుణదోషములను నిష్పక్షపాతముగాఁ జూపిరను టకుఁ దార్కాణమగుచున్నది. మఱియు-

అసహ్యతుచ్ఛ శృంగారముల స్వరూప మిట్టిదియని చూపుచు ఉత్తమ శృంగారమునకు, గవిత్రయము వారి పద్యముల ను దాహ రించిన రెడ్డిగారు, ప్రబంధకవులు కొందఱు గతానుగతికముగా శృంగారరస మర్యాద నతిక్రమించిపోవుటను నూచించుటయేగాక, ఉత్తమకవుల వర్ణనలను బట్టియు లోకానుభవమును బట్టియు శృంగారవర్ణన మిట్టున్న హృదయంగమముగా నుండునన్న కవితా ధర్మమునుగూడ నుపదేశించిన వారైరి.

రెడ్డిగారు విమర్శనతత్త్వవిజ్ఞాన -మందారితేణినవారగుటచే నీవిమర్శనము నతిసమర్థతతో నిర్వహించిరని నాయాశయము. ఆంధ్రదేశమునఁ జక్కఁగ వ్యాపించియున్న యట్టి యీ గ్రంథ మందలి విషయమును విద్వల్లోకమును విద్యార్థి బృందమును