పుట:Kavitvatatvavicharamu.pdf/189

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
                                                     

తృతీయ భాగము

మొదటి ప్రకరణము

                                             మధుర లాలస ప్రభావతియొక్క యక్క
    ఈ పొరఁబాటులంగూర్చిన ప్రస్తాపములు ముఖ్యములుగావు. ఏలన, షష్టాశ్వాసము తుద మొదలు క్షమార్ధములుగాని దోషములు దట్టముగ నుండుటచేత, వీని చింత యావశ్యకము. మణికంధ రుఁడు కళాపూర్ణ డై పుట్టి రాజ్యముఁ జేయుచుండఁగా, నతని కొలువుకూటములో శిశువగు మధురలాలస యొకనాఁడు హారము యొక్క నాయకమణి హృదయస్థమగుటఁజేసి యా కళాపూర్ణాది పాత్రంబుల చరిత్రంబు లత్యద్భుతంబున మందలించినది. రాజు గారి కిదివఅకే యు భినవ కౌముది భార్య యూయెను. మధురలాలస తాను కళాపూర్ణుని భార్య యగుటకై యవతరించినదని తెలిపెఁ గావున.
              “క.  ఆ మధురలాలసా కథ
                    లేమియు శుద్ధాంతమునకు నేగకయుండన్ 
                    భూమిపతియడఁచె నభినవ
                    కౌముది విననేలయనుచు ఘనయత్నముతోన్."
                                                                      (కళా. ఆ, 6, ప, 190)
     ఇది హాస్యమా ? ప్రయోజక మా ? ఎట్లును అభినవ కౌముది కోపతాపములు లేక ద్వితీయ వివాహమునకు సమ్మతించుచున్నది గావున నీ జాగ్రత్త యేమియు C బనికిరాదు !
     ఇఁక కవి శృంగారమునకు దిగి పాడు ప్రబంధ ధోరణికిం జేరిన ముఱికినంతయు నింపైన సుగంధమని దట్టముగఁ బట్టించు చున్నాఁడు ! మధురలాలసకు యావనము వచ్చినది. కవితకు వచ్చినది ముదిమి ! యా వనము వచ్చుసరికి కవి కృతమైన యం గాంగ పరీక్షయు వచ్చునుగదా ! ఆయమ్మ యా కాలమునఁ బెద్ద తో ఁటవలె నుండెనఁట !
            సీ.   గురుతర స్తనకేళిగిరులును గంభీర
                                 తరనాభి కూపమతల్లికయును 
                  జారురోవూల్డి శృంగారధారాసర
                                ణియు నంగుళీకిసలయచయంబు
                                            182