పుట:Kavitvatatvavicharamu.pdf/174

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ద్వితియ భాగము } {} { ఉత్పేక్ష భాస్కరరామాయణమున సీతాపహరణ ఘట్టమున స్థావర జంగమ మయమైన ప్రపంచమంతయు నాయమకై యాక్రోశించె నని యెంత యుదాత్త రేఖగా నుత్పేక్షింపఁ బడినదో చూడుఁడు. తే. ఓలి శృంగంబునెత్తినకేలుగాఁగ నిర్హరంబుల పెను మోఁత నిగిడిబెరయ గిరుల జనక రాజాత్మజ పరిభవంబు జగములెఱుఁగ నాక్రోశించు వగిదిఁదోఁచె. {భాస్క ఆర. ద్వితీ, ప. 151) సీత ! పరమపావనమూర్తి ! శ్రీరాముని భార్య. దౌష్ట్యమున నా మెను బలాత్కరించి కొనిపోయినవాఁడు సర్వలోకాధీశుఁడగు రావణుఁడు. రాక్షసవంశ సంహార కారణమైన దీ యాగడము. ఇట్టి జగత్ ప్రధాన సందర్భంబులఁ బ్రకృతియు మనుష్యమాత్రులరీతిని సుఖ దుఃఖాది వికారములందాల్చిన ట్లుత్పేక్షించుట సమంజ సముగాని, చీమకు దోమకు వాసియైన నాయి కానాయకుల పాటులం గూర్చి లక్షించునదిగా వర్ణించుట గాంభీర్యమునకు గొఱఁత. వస్తువుల కొలందులు గణింపక వర్ణించిన నఁగుబాట్లగును. ప్రబంధములలోని ముఖ్యదోషములలో నీ వివేచన విహీనవర్ణన మొక్కటి. ఏ కుగ్రామముఁగాని, యెట్టి నికృష్ణరాజులంగాని, వీర కావ్యముల ధోధgధిగా వర్ణింతురు. పట్టణ ప్రాసాదములు మిన్ను ముట్టునఁట l భర్మ హర్మ్యములు గవాక్షములలో చంద్రుడు దూఱి పోవునఁట ! ఇ(క రాజు గారో యూ పురికిఁ దగినవారు ! పంచ పాండవులు, దాశరథులు అందఱును గరఁగించి బ్రహ్మపోతఁ బోయగా నవతారమెత్తిన పురుష స్వరూపులు ! కానిండు ! ఈ బల పరాక్రమములకు దగిన శౌర్యప్రారంభముల నొడఁగూర్చినఁగదా యా గుణములు సార్థకములగుట. అట్టి కథాకల్పనా శక్తియో సున్న ! మహాకవుల యూహలలోఁ గొన్ని దొంగిలించి కొన్ని విడిచి పెట్టుటలో లాభములేదు. కైకొన్న నన్నియలిఁ గొనవలయు, లేదా, పూర్ణముగా వదలి తన నైజము కొలఁది వ్రాయవలెను. లేనిచో పరస్ప రా సంగతి బాధ చే సందర్భశుద్ధి చెడును. ప్రబంధవర్ణనలు తావు మార్చవచ్చును, ప్రథమాశ్వాసముతో నిది ద్వితీయమునకుఁ బరివర్తించినను లోపముగాఁ దో(పదు. మఱి బొత్తిగాఁ దీసివేసినను, ఇక్కడ నేదియో యుండవలయు