పుట:Kavitvatatvavicharamu.pdf/172

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సీ. ద్వితీయ భాగము Í 65 మకరకులక్షుభ్యమాణమై తద్బాధ కోపనియదివోలె, నుచ్చభీమ నినదమగుచునున్న నీరధియొద్దకు (భా. ఆర. ఆ. కి, ప. 38} నురనది ధరణీతలంబున కరుగుదెంచి కలహంసగతియు నిర్మల ఫేనహాసంబు నాకీర్ణమీన విలోకనములు నాలోలపవనవాచాలితకల్లోల రసిక మృదూక్తులు నెసఁగుచుండఁ బ్రీతితో భగీరథుఁడను దూతచేత నీతయై మహాముని పరిపీతరిక్త మగు సరిత్పతిఁగూడి యూ సగరజులకు హితముగా దానినించె నాతతజలముల (భా. ఆర. ఆ శి, ప. 83) నానావర్ణశిలా విహ గానేక మృగాభిరామమై భూ నారీ నానాభరణ విభూషిత పీనోన్నతకుచముఁబోలె వెలిఁగెడు దానిన్ లలితాచ్ఛస్ఫటిక శిలా తలములపైఁబాఱు విమలతర నిర్హరిణీ జలపూరముల నుదారో ల్లలదురు పశిరాలి నుజ్జ్వలంబగుదానిన్ (భా. ఆర. ఆ శి; 3. 292–293) మిశ్రమలు : š. ఖరకిరణ తాపమున నురు తరదవదాహమున శోషితములైన వనాం తరతరుతతి కాప్యాయన కరమై వర్ణాగమంబు గడుబెడఁగయ్యెన్, విశద శారదాంబుద పరివేష్టనమునఁ బొలుచు గగనంబు ప్రతిబింబమో యనంగ వికచకాశవనీ పరివేష్టనమున నతిశయిల్లె నిర్మల క్రమలాకరములు.