పుట:Kavitvatatvavicharamu.pdf/171

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

 164 కవిత్వతత్త్వ విచారము

లయ గ్రాహి.
చందన తమాలతరులందు నగరుద్రుమములందుఁ గదళీవనములందు లవలీమా
 కందతరుషండములయందుననిమీల దరవిందసరసీవనములందు వనరాజీ
 సందఖిత పుష్పమకరందరసముం దగులుచుందనువు సౌరభమునొందజనచితా
నందముగ బోషితులడెందములలందురఁగ మందమలయూనిల సుమందగతి వీచెన్.
                                                     (భా. ఆది. ఆ, 5, ప. 138–139)

          చ. కురిసెఁ బ్రచండవృష్టి పున ఘోషము లెల్లఁ గెలంకులన్ భయం
              కరములుగాఁ గరాళ కరకాతతు లొప్పఁ దటిల్లతాళివి
              స్పురితముగాఁ బ్రపూర్ణజలపూరము తగ్గిరికుంజభూరిని
              ర్డరతటినీతటి నికటసాలచయంబు విమూలితంబుగన్.
                                                              (భా. ఆర. ఆ. 3, ప. 297)

క. లలితమథు స్రవ ఫలములు
         విలసిత మృదుపత్రతతులు వృత్తన్కంధం
         బులు నవిచలితచ్ఛాయలు
        గలబదరీతతులఁజూచి కడువిస్మితులై,
                                            (భా. ఆర. ఆ. 3, ప. 308)

సాలంకారములు

మ. ప్రమదాసాదిపయః ప్రపూర్ణ మిదిగో ! పద్మాకరంబంచుఁద
   త్కమలామోద సుగంధమారుతము వీఁకన్ మున్నెజింగించెన
   స్రమణంబిల్చె సరోవరంబనిలజన్ రాజీవ రాజీవస
  త్సమదాళి వ్రజచక్రవాక బకహంస క్రౌంచనాదంబులన్.
                                                 (భా. ఆది. ఆ. 6, ప. 172)

సీ.రంగదుత్తుంగతరంగ హస్తంబుల
                నాడెడు నది వోలె, నతుల వేగ
వాతవిధూతమై వఱలెడునది వోలెఁ
            బర్వతకందరోపాంత తతులఁ
దొడరెడు నదివోలె ధ్రువ ఫేనవితతుల
                   నగియెడునదివోలె, నాగన