పుట:Kavitvatatvavicharamu.pdf/165

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

158 కవిత్వతత్త్వ విచారము

         సర న్వతీ చతుర్ముఖ విలాన ఘట్టము

ఒక విషయముఁ బట్టిచూచిన సరస్వతీ చతుర్ముఖ విలాస

ఘట్టము" వంటిది యాంధ్రంబున నెక్కడను లేదు. ఏవిషయమన,
ప్రకృతిని పాత్రముల జీవితముతోఁ గలసినట్లు వర్ణించుట.
                         ప్రకృతివర్ల నావిధములు
         ప్రబంధకవులు వర్ణించిన జాడ వేఱు. వృక్షములు కొండలు
లతలు మొదలగు వస్తుప్రపంచమంతయు నుప్రెక్షకు సామగ్రి.
అందును స్త్రీ సామ్యముగాను, శృంగార క్రీడగాను ఉత్పేక్షించు
టకు. వసు చరిత్రములోని యుద్యానవనము గూర్చిన ప్రశంస
లిందుకు, బ్రమాణములు :
   "చ.   ఒనరహిమావకుంఠనములూడ్చి తెమల్చిన పత్రభంగముల్
          సన నసియాడుచున్ మొగడ చన్నులు పల్లవపాణిఁగప్ప నూ
         తనిలతి కాలతాంగుల నుదారగతిం జలివాపి నెయ్యపుం
         బెనఁకువనేర్పె దక్షిణనమీరణుఁడొయ్యనఁ దావులంటుచున్."
                                                           (వను. ఆ. 1, ప. 127)
   “చ. జనపతిదారసిల్ల నొక నంపఁగి తావులకొమ్మ రాగవ
        ద్దన సుమనోభిరామయయి కాఁకవహింపఁగఁబోలు !కానిచో 
        ననుపమపంచసాయక కరాంచలచంచలచాపశింజినీ
        జనితకరోధరుంకృతివి సైఁపకయొన్నె పరాగపాండువై.”
                                                         (వసు. ఆ. 1, ప. 156)
    ఈ యుత్ పేక్షల నుద్ధరించుటకై యెత్తఁబడిన సాధనములు
సకృత్తుగ సహజోపములు. బహుళముగ శ్లేష. ఏ వస్తువుల లోనైన
స్త్రీలు లీనలు. దానికి సరిపోవునట్లు స్త్రీలలో నే వస్తువైన లీనము ! 

ప్రబంధ ప్రపంచము స్త్రీమయము. ఆcడుమళయాళము. ವೆಬ್ದು,

చేమలు, పక్షులు, సరస్సులు, నదులు, గుట్టలు, అన్నింటనుండియు
నుత్ పేక్షయను పుటము వేసి శృంగారభస్మముఁ జేయవచ్చును ! 

'ప్రభావతి మంచి దుక్కి సాగిన పొలము" అని సూరన వర్ణించి

యుండుట జ్ఞప్తియున్నదా ? సూరన్నయందును ఈ దుర్లక్షణము
     *ఈ పుట్లమునను ఒక లోపము. వానకురియుచుండగా మగనితో సమముగ
దామను క్లేశముల ననుభవింపవలెనను సుగాత్రియొక్క కోరిక వ్యర్థముగ నా చినుకుల
వారు తడియలేదట. తడిసిన నొండొరు లింకను చల్లగా నుండియుండరా !