పుట:Kavitvatatvavicharamu.pdf/155

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

148 కవిత్వతత్త్వ విచారము

వినయ మర్యాదలుగల మంచివస్తువని యెంచిరో ! సందేహమేల ? యెంచిరి. మనవారి నమ్మిక మీరెఱుఁగరా ? కూతురా ! ఫలానా పక్కీరు శాస్త్రి నీకు పురుషుఁడు. నేను నిర్ణయించినాను. నగలతోడ నీ మనస్సును మూటంగట్టి వాని యింట్లో పదిలము గానుంచి సుఖపడవలసినది. నా మాటయిది. ఇంక నీ కేమి యీ పనితోఁ బెత్తనము ? చెప్పినట్లు చేయుమనియే గదా తలి దండ్రుల సంభావన ! పెండ్లిలో నన్ని మంత్రములు C దంత్రములు నుండును. ఒక్కటిదప్ప ! ఎయ్యది ? ఆత్మతంత్రము వివాహము సంస్కార మఁట ! హృదయ బహిష్కారమనఁ గూడదేమో !

ఇట్లగుట శృంగార భావములును నోరు లేని కొడుకులుc గూఁతులుంబలె శాస్తో పదిష్ట క్రమముల మేర మీ అక యాచారముల ననుష్టించి సర్వసామాన్యముగ నుండునని భ్రమించి, ఈ సామాన్య స్వరూపము నలంకార శాస్త్రములు కనిపెట్టి వెల్లడిచేసినట్లు మఱ యొక్క భ్రాంతింజెంది, యవి చెప్పినట్ల తఱచు మనకవులు వ్రాసి యున్నారు. కామమునకు C గారణ మొక్కటిగాదు. మఱి పెక్కులు. పోవుమార్గములు, ಶೌ ಲು) ఉపభావములు, చూపు చిన్నెలును ప్రతి వారియందును నవీనములు. అనన్యములు. ఫలములు నట్టివే. పేమచే విషముఁ బెట్టువారు లేరా ? తన కుం దక్కకపోయిన నొరులనుం జెందఁ గూడదని హృదయ ప్రియులను గొందఱు మృత్యువు వాతఁ ద్రోయుదురు ! కొందఱు ప్రాణములనైన నర్పించి వారికి మేలుచేయు జూతురు. బలాత్కరింప నెంచువారు నున్నారు. పరస్పర ప్రీతిలేని కూటమి హేయమని రోయువారుం గలరు. భయము, శోకము మొదలగు వానిచే వికలితస్వాంతలైయుండు స్త్రీలమూర్తులు గొందఱకు నాcప రాని మోహాతిరేకముఁ గలిగి o చును ! శాస్త్ర దృష్టితోఁగాక దేవుఁడిచ్చిన సొంతపు గన్నులతోఁ జూచు వారికి నిట్టి విశేషములు సులభముగ గోచరింపఁ గలవు.

సూరన ప్రతిభావంతుఁడు. కనుక సంపూర్ణముగఁ బాండిత్య బద్ధుఁడు గాఁజాలఁడు. స్వశక్తియే గురువుగ నూతన మార్గములం ద్రో క్కి యాతఁడు ప్రకటించిన యసాధారణ శృంగారములకు ముఖ్య నిదర్శనము లీ క్రిందివి. శల్యాసుర విషయము. సుగాత్రీ శా లీనుల వృత్తాంతము. సరస్వతీ చతుర్ముఖ విలాసము. కల భాషిణీ చరిత్రము. శల్యాసురుని కథ శల్యాసురునిఁ గూర్చి చెప్పవలసిన సంగతులు కొన్నియే.