పుట:Kavitvatatvavicharamu.pdf/154

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ద్వితీయ భాగము 147 శృంగారము వర్ణింపఁబడియున్నది. ఇందు జావళీలకుఁ జేరినది యొకటి మాత్రమ. అయ్యది యప్రశస్త మనఁదగిన భాగములో నుండుటచే దాని ప్రస్తావన యిటఁ జేయను. తక్కినవానిలో నొక దానివలె నొకటి యుండదు . అన్చియు రమణీయముల. కామము అనునది జాతి. సామాన్య ప్రబంధకవులకు దెలియకున్నను దాని యందు పజాతులు లెక్కకు మీఱి యున్నవి. స్త్రీ పురుషులలో ప్రతి వారు ను వలచు విధములు వేఱు. ఆచారము రీతిఁ జేయఁబడు తిలకవ స్థాది రచనలో సయితము తమకు సొగసులని తోఁచెడు భంగుల చిత్త మేర్పడునట్లు పచరింతురు గాదె ! ఇంటి పెద్దలు, ఇరుగుపొరుగు వారు c జూచి పది మాటలాడుటకు నాస్పదములైన బహిరంగపు వర్తనలయందే వ్యక్తి సర్వవ్యాపిగా నుండఁగా, మన సులో నుద్భవిల్లు రాగము ల లో ప్రత్యేక భావములు చందములు నుండక యచ్చుగొట్టిన రీతి నందఱు నేక గతిం జరింతురా ? సంపూర్ణమగు ననువర్తనము తలపాగఁ జట్టుటలోనే లేదఁట ! ఇఁక మనసును గన్నును పోవు జాడలలో నుండునా ? శృంగారము శాస్త్ర ప్రకారముగాఁ దీర్పఁబడు విగ్రహము గాదని యెఱుంగని మన వారి విలక్షణత నేమనవచ్చును ? సామాన్యముగఁ జైతన్యముల లోనే యేక క్రమము అప్రకృతము. మానవులలో నదిచెల్లునా ? సాధ్యమా ? ෆු උද් మనుష్య భావముల నెల్ల నుత్కృష్టతరమగు చెూహమున కట్టి జడ సంప్రదాయము శక్యమా?

         మనకవ లీ సంగతి నెఱుంగక కామమునకు నాచారము c దీర్చియుండుటకుఁ గారణములు, వారి మౌఢ్యము, హిందువుల జీవితము యొక్క రీతియును. ఎట్లన, “మన లోఁ బెండ్లికి మనసు నకును సంబంధములేదు. పరిణయము వ్యవహారములలో నొకటి. చిత్తజము గాదు మఱి పితృపితామహజము. మనసును నిరోధించి పీడించు వర్గములలో ముఖ్యములు జాతి భేదములు. తమ తమ యుపశాఖలను మీఱి హృదయము వ్యాంపింపఁ గూడదఁట దీని వలనఁ గలుగు ఫలమే మనంగా, అమనస్క వివాహములు. అనఁగా దేహ మొకచోట చిత్త మింకొకచోట. మాట లిక్కడ తలఁపు లక్కడ. చిత్తము శివునిమీఁద. భక్తి రంకులాఁడిమీఁద !"
            అటగుట వధూవర సంగమము ఆచారాను సరణముగా ఁ జేయఁబడు కర్మము, ప్రాయికముగ కామిత మనుట కల్ల. పెండ్లిం బట్టి చిత్త వికృతయును శృంగారభావమును, చట్టదిట్టముల ప్రకా రము అలంకారాది శాస్త్ర సూత్రముల యూదేశము చొప్పనఁ, బోవు