పుట:Kavitvatatvavicharamu.pdf/151

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

144 కవిత్వతత్త్వ విచారము

వీడేఁ నిక్కంపు నలకూబరుఁడు. పురుషులలో నీసును రోష మును హెచ్చిన నవి మాటలఁ దీఅవు మఱి పోటుల దీఱుఁగాని, వచ్చిన రెండు నిమిషములకే వాదములు. సత్యములు, సామెతలు వీని పొంతఁబోక ప్రధాన కార్యమున కాయత్తుఁడై రెండవ నల కూబరుఁడు

          "మ. మది నా మాటలు నమ్మవేనియు నిఁకన్ మమ్మిద్దరటన్ దైర్య సం
                 పదఁ బెంపారఁగ దవ్వల న్నిలిచి యోపద్మాక్షి! వీక్షింపు మే
                 నిదె ఖండించెద వీని మామకమహా హేతిప్రకాండంబుచేఁ
                దుదశోధించెదు గాని నీకుఁగల యుక్తు ల్మీఱ నాసత్యమున్."
                                                                   (కళా. ఆ. 3, ప. 249)

అన్నాడు. న్యాయనిరూపణమునకుఁ గత్తుల వంటి ధర్మరాజు లెవ్వరు లేరని గదా మగతనముగల వారి సహజమతము ! యుద్ధ మను మాట లేచుసరికే, రంభ తన కృత్రిమనాథుని గట్టిగా బట్టు కొని, యే జగడము ప్రారంభము గాక మున్నే,

“చ. ... ... ... ... ... భూరికృపన్ నను గావ రే ప్రియన్
     మనుపరె వేల్పులారా ! యొక మాయపురక్కసుఁ డాక్రమించి తాఁ
     దునుముచు నున్నవాఁడలుకతోడ నిరాయుధు" నంచు........
                                                      (కళా. ఆ. 3, ప. 250)

రం నేడ్చుటకు మొు ద లిడినది . ఈ యేడ్పునకుఁ గారణము భీతి. దీనికి ముందేడ్చినది కొట్లాట, కోపము, వీని చేనైన యల సట, కోలు పోయిన యభిమానము, అలుక ఇత్యాదులచే నైన వ్యసనభావముచే.
          నారదుఁడు రంభ ల నపహసించి పోవు వాఁడు ఊరక పోలేదు. నలకూ బరుని కడకుఁ బోయి యతనితో 'నీ యాకారము దాల్చి యిం కెవ్వడో రంభను గూడియున్నాఁడు. త్వరలో వెళ్ళి సొత్త దక్కించుకొనుము' అని యుపదేశింపఁగా నాపల్కుమై సత్య నలు కూబరుఁడు వచ్చి యా మిధునము యొక్క సల్లాపములకు విమాత మొనరించెను. పిమ్మట నయ్యిరువురు బాహుయుద్ధము నకుం గడఁగి పోరు చుండcగా భ

"ఊ. ................................ నిలుండు నం
    రంభము మాని యేనడుగు ప్రాక్తనవర్తన మొక్కటిన్ రహ
    న్సంభవమైనదాని వరుసన్ వచియింపుడు మీఱ లిత్తన్'
                                                            (కళా. ఆ. 3, ప. 269)