పుట:Kavitvatatvavicharamu.pdf/150

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

 ద్వితీయ భాగము 143

దకువపాతము ? అని యడుగుదురేమో ! ఈ వివరమిఁక ముం దేర్పడును. మణికంధరునితో డి కూటమియు నా పెయొక్క వాంఛి తంబ కాన దాని చే విమనస్క త యూ పెకుఁ బాటిల లేదు .

ಇట్ళు రంభ నలకూ బరునిం గూడి తనకు విజయము సిదించి
 నను , అతనికై తాఁబడ్డ పాట్లుదలఁచి, ఇది వఱకు వైరముచే దన
 యందు నుదయించిన స్టైర్యము, కాఠిన్యము నా వైరితోడ యంత
రాన మొందఁగా, సీ జన సహజమగు మెత్తఁదనము తన్నాక్రమింప,
మేనసు నొప్పిచేఁ గోపంబు వగపుగా

సీ. .....................................
    ప్రియుఁ జూచిఁ జూచి మగవారి ప్రేమ లిట్టివిగదా
                    యాట్ట్ నమ్మఁగవచ్చు నిచ్చలోనఁ
    బ్రాణాశ యటు దండవాసినమాత్ర నీ
                     ద్రిమ్మరి నెచ్చోటఁ దెచ్చికొంటి
   నిన్ను నేమన నున్నది నిరభిమాన
   గుణత నినుఁ జేరు నన్ననుకొనుట గాక
   నాకునా యిన్ని పాట్లంచు" నా కులమతి
   నడలెఁ గన్నుల బొట బొట నశ్రులొలుక.
                                                 (కళా. ఆ. 3, ప. 241)

ఆహా ! యీ సంగతి యెంత స్వభావికముగ నున్నది? సవతి
యుండువఱకు గన్నుల నిప్పలు. అపె పోయిన వెంట గన్నుల
నీళ్ళు! ఒక నిమిష మెండ. మఱునిమిషము వాన ! ఈ లీలా
లాలిత్యము ప్రెమ భరాలసలగు స్త్రీలకే కదా ! కొందఱు దీనిని
చపలత యందు రు . ఈ చపలత లేకున్న వారికట్టి యాకర్షణ
శక్తియు మనసుల రంజింపఁజేయు పటిమయు నుండునా ? నిశ్చల
తత్త్వము లెవరికిఁ గావలయును ? జడులైనవారికిఁ దప్ప. స్త్రీల
యందు కోపము మిక్కుటమైన దాని ప్రతి కార్యమగు నేడ్పును తప్పదు.

వియో గాంతముం గాంచిన యీ వధూవరు లిట్లు ఒండొరుల
నూ రార్చుచు ను పశమన క్రియల కుత్సహించుచుండఁగా.

“మ. .................. . . వేబొక్కడం
     తనవచ్చెన్ నలకూబరుం డచటికిన్ 'నా రూపమందాల్చి వం
     చన నెవ్వాఁడుర చేరినాఁడఁట దురాశన్ రంభా' సంచున్ వెనన్?"
                                                      (కళా. ఆ. 3, ప. 243)