పుట:Kavitvatatvavicharamu.pdf/149

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

142 కవిత్వతత్త్వ విచారము

క. ఈ కలహ మపుడు వినఁబడు
      నాకంబున సురల యూననము లేగతి నా
       లో క్రింతుఁ దెగినఁ దెగనీ
      నాకు మరుఁడు నిన్ను నిలుమనన్ రాకురునికిన్ ! 232

\

ఇప్పడే కాదు. ఇఁక ముందును నాకలోకమునకు నడుగు వెట్ట
 దఁట ! మనుష్యాంగన పోఁ జాలదు. ఈ లోపముఁ గప్పిపుచ్చుటకై
యేమి యుక్తి ! ' మఱియు తెగినఁ దెగనీ నా కుమరుఁడు" అనునది
'కార్యము మించిపోయినది యోటమి తప్పదు " అని యెఱింగియు,
 తానే ముందుగా నతని వదలినట్లు నటించియైన మానము రక్షించు
 కొందు ను అని యెంచి చేసిన యింకొక యుక్తి యిది ! సరి. నల
 కూబరుఁడు సంశయాత్ముఁడై యా పెను మెడపట్టి పాయం ద్రోసెను.
 నిర్దిద్ర మోహఫలమా యిది సత్యరంభయు నాయు మను కత్తిచేతఁ
 గాయము వాయుము, అని శపించెను ! ఉదార చిత్తులకు కష్టములే
 గదా ప్రాప్తి ! కలభాషిణి యేకచిత్తయై యిన్నేండ్లు తపించినందు
 లకు ఫలము లిట్టివి ! అయినను పరునిచే నా క్షణ కాల మా దరింప
 బడుటయే ఈ కడగండ్ల కెల్ల మించి మీఱిన ప్రతిఫలముగా నా మహ
 నీయురాలికిఁ దోcపక యుండదని నమ్మెదను ! గొప్పవారికి వ్రతమే
 సుఖము . తుచ్ఛులకు సుఖ మే వ్రతము ! ప్రబంధములోని నాయ
 కల కెల్ల నీ కల భాషిణి శిరోమణి వంటిదగుటను. కవి యొక్క చమ
 త్కృతిని విడఁదీసి చూపుటకునై యీ ఘట్టము నింత విస్తరించి
 ప్రదర్శించినాఁడను. పాపము. ಇಲ್ಲು ఖిన్న మానసరైన యవ్వర
 వ ధూతిలకంబు కల భాషిణి యేగుటయు, నాయమదలఁచుకొన్న
 మన కెల్లరకు దుఃఖము రాకపోదు. ఇక రంభం దలఁచికొన్న
 నవ్వు తప్పదు ! ఏలన ఇంత గాఢముగ నా దైవత కాంత కొట్లాడిన
 దెందుకు ? నలకూ బర ప్రాప్తికై దొరికిన దెవ్వరు ? ఆ మోటుదపసి
 మణికంధరు డు ! వానియొక్క నిజము c దెలిసి యుండి నయో డ
రంభ ఛీ యని కన్నెత్తియైనఁ జూడక యరిగియుండదా ? ఏమో
 యింద్రు డాజ్ఞపించెనని వానిం గలిసి నది గాని మోహము చేఁగాదు
. మనసులేని పరిణయములో cబడి స్రుక్కు చుండవలెనని స్వతంత్ర
 లైన పుణ్యాంగనల కేమి విధి !
       'సరే కాని, కల భాషిgటికి మాత్ర మిట్టి యనిష్టము ప్రాప్తింప
లేదా ! ఆ పె గోరినదియు నలకూబరు నే, తుదకు ననుభవించినది
 మణికంధరుని. అట్లగుట రంభకన్న నా మె యెట్లు పరిహాసమునకుఁ