పుట:Kavitvatatvavicharamu.pdf/148

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ద్వితీయ భాగము Í 41

బోధించుటకై పిలుచుడు, దైవమా ! ఇఁక కల భాషిణి గతియెట్లు ? కోరినవారి రూపములఁదాల్చ వరము నారదులచేఁ బడ సెనేని, కామగమనము బడయదాయెఁ, గావున రంభ చేతిలోఁ జక్కగఁ జిక్కినదై, చిన్నతనము రాకుండునట్లు బింకములైనఁ బలికి త్రోవఁ జూచి కొందమను స్త్రీ సహజమైన గరువతనంబు మెఱయ నేమను చున్నది చూడుఁడు !

“సీ. అప్పరః స్త్రీలలో నగ్రగణ్యత్వంబు
                      జగదుపత్లోకి తంబుగ వహించి
     యూర్వశీ మేనకాద్యుత్తమ స్త్రీలు రా
                     వమ్మ పోవమ్మ నా నతిశయిల్లి
      యెన్నండు నెచ్చోట నెవ్వారిచేవ్రేలఁ
                       జూపించుకొనక ప్రస్తుతికినెక్కి
      నలకూబరుండు ధన్యతముండునా గరు
                        వతనంబుచే నీకు వన్నెఁదెచ్చి
        యొప్పనే యింకఁ గడపటి నిప్పిశాచి
       నాకు సరిచేసికొని దేవలోక సభకు
       నీవు సూ నీవు నుమ్మని యేవిధమునఁ
       గలహమాడెద నిది నీవె తలఁచిచూడు."
                                        (కళా. ఆ, 3, ప. 228)

క. కోపము పాపమునకుఁ బొ
   తపెనుఁదగవునకుఁ దగఁగనే తిట్లాటల్
   ప్రాపించునో పడంతుల
   కోపురుషశ్రేష్ట యవియు నొక్క బ్రతుకులే ! 229

వ. ఆదియునుగాక.

క. రంభకు నహహా యొకప్రతి
    రంభ గలిగి తిగిచి తెచ్చె రచ్చల కనినస్
    స్తంభింపనీరు హాస్యా
    రంభణ మీపోరు నిర్జరవిటుల్ నగుచున్.

230

క. నానడకలకును యోగ్యము
   గానిది యిపు డిచట నైనఁ గలహమ, బ్రదుకె
   ట్టెన నగుఁగాని యిఁక నీ
   యాన ధరణి విడిచి దివికి నడు గటు వెట్టన్ ! 231