పుట:Kavitvatatvavicharamu.pdf/147

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

1 40 కవిత్వతత్త్వ విచారము

మాటలేగాని దెబ్బల సరసము పొంతకైనఁబోరు ! కరములు అభిన యములకే గాని కొట్లాటకుఁగావని స్త్రీల నైజమతము గాదా ! ఇవ్వడు వున వాగ్యుద్ధము రేఁగుచుండఁగా నారదులు విచ్చేసి నలకూబరునితో హాస్యములాడిరి ! పిమ్మట నతఁడు తనకై పోరుచున్న రంభల నిరువురిం జూపి వీరిలో ! తథ్యమిథ్యాభావము లేర్పఱుపుఁడని వేడఁగా నా కలహ భోజనులు

             క. .. .. . . . . . . . . తథ్యమిథ్యా
                   భావంబులకేమి నీకు భావింపఁగ స్వా
                   భావికమే యీ యాకృతి
                   భావము నిజమెద్ది యూ ప్రపంచమునందున్'</poem<poem>>

   క. నీపట్టురువడ నొక్క తెఁ
    జూపి యొకతె గర్వమడఁపుచున్ వలయుగతిన్
    ప్రాపింపవచ్చు భోగము
    నీ పుణ్యంబినుమడించి నేఁడు ఫలించెన్ !
                                        (కళా. ఆ, 3. ప. 210-211)
ఆని యానతిచ్చి తమ దారిఁ దా మే గిరి. రంభ లు మరల నెప్పటి యట్ల వాగ్యుద్ధమునకుం దొరకొనిరి. అం దొక్క తె

" క. అఱపు లుడిగి పోపో నీ
      యఱచేతంబడ్డు వచ్చినప్పడు మమ్మున్
      గఱచెదవు గాని తగునెడ
      మొఱయిడు మది యెట్టి దైవములు వినియెడినో !”
                                                       (కళా. ఆ. 3, ప. 218)
  అనుటయు సత్యరంభ

             "క. కానిమ్మ వేగిరిలపకు
                  నీ నుదుటనె ప్రొద్దు పొడిచెనో యే దైవం
                  బైనను విననిప్పడె యిదె
                  నిజమేర్పరచి నీకొనర్చెద శిక్షల్י"
                                                        (కళా. ఆ, 3, ప. 220)

అని బదులిచ్చి యొక్క మంచి యుపాయంబుఁ జింతించి నల కూబరాకారునితో గల సి విజ్ఞవీగుచుండెడు రంభను 'రా' దేవ సభకుఁ బోవుదము. అని యా పెకు ఖేచరత్వంబె లేమి నాతనికిం