పుట:Kavitvatatvavicharamu.pdf/144

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ద్వితీయ భాగము 137

అని పల్కుచు విభ్రాంతుఁడయ్యెను. అయ్యా ! కల భాషిణి కి వచ్చిన కష్తముము ! లేక లేక క్లేశపడి సంపాదించిన యర్ధము క్షణ భంగురమయ్యెడు తెఱంగైన నా దైన్యము చెప్పఁదీ అునా? అపుడా లతాంగి యేమన్నది ?

"సీ. అట్లైనఁ బ్రాణనాయక నినుఁ గౌ(గిటఁ
                    బాయనే వెఱతు నీ మాయలాడి
      యీ రూపుతో మనకెడ సేయ నేతెంచి
                        నదియు తొల్లియు నొక్క యనుర జంత
      జనకనందనకు రామునకును నెడ సేయఁ
                         గడఁగి వచ్చుట వినఁబడుచునుండుఁ
     గావున దీని నిక్కడఁ జట్టుఁబట్టున
                         నుండఁగ నిచ్చీన నొప్పకుండు
      వట్టిమొగమాట లాలించి గట్టి గాఁగ
     నదరవై చుచుఁ జనుమంచు నౌరనీవు
     గదలెదు సుమంచు సంభ్రమ మ్మొదవ నపుడు
     కాంతు కంఠంబు నొకకేలఁ గౌగిలించె"
                                  (కళా. ఆ. 3, ప. 177.)

ఇకపై నీయిద్దఱ సవతుల కొట్లాట వర్ణింపఁబడియుండు తెఱుంగు వర్ణింప నా తరముగా దు ? ఇది యద్భుతావహము. స్త్రీ ప్రకృతికి దర్పణము. రసవత్తరము ! ఎన్నిసా మెతలు, నీతులు, తిట్లు, తలత్రిప్పలు ! తుట్టతుదకు కన్నీళ్ళును ! సత్యరంభ వచన ములు కొన్ని చూడుఁడు !

"క. వినుమూ యేర్పాటు దనం
           తన యగుచున్న యది యెట్లుఁదప్పదు నత్యం
           బనఁగా దైవంబనఁగా
           జనులకు లేకున్న నెట్లు జగములు నడచున్”
                                                            (కళా. ఆ. 3, ప. 1182)

“సీ. ఆల్లప్పడొకచోటఁ జల్లని సురపొన్న
                                నీడ మెచ్చుచును నాతోడఁగూడి
            యందుఁ బల్లవశయ్యఁ గందర్ప వ్రేళినిం
                            పొందుచోఁ బటమటి యందు నొక్క