పుట:Kavitvatatvavicharamu.pdf/139

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

132 కవిత్వతత్త్వ విచారము

గిన వారమై, యెట్లు, వచ్చితిమో, 'యాది యొయ్యది, అంత్య మే దిక్కున నుండు ' నని విస్మయానందముల నోలలాడుచుం దుము. మణికంధరుని స్తుతి వ్యర్థచేష్ట గా దు. ఆ కా శమునఁ జేయ బడి యుండినందున గల భాషిణి వినియుండదు . అటు వినమి యావశ్యకము లేనిచో నలకూ బరునిపైని వలపు చేనైన దైన్యముతో నారదు నాశ్రయించి యుండదు. మఱియు నా పొగడిక రంభకు నసూయా కారణము. ఆ యు సూయ చేఁ గదా యూ పె నారదుని క్రో మాటలాడుటకై వచ్చి నల కూబరు ఁడు " నర భామల పోCడుములకు బ్రమయకయున్నే" యని దరహా సము చేయుట ! నారదుండును ప్రతిహాసముఁ జేయ ( బూని,

“క. నినుబోలు వనిత నీకును
         వనజముఖీ యితనిఁబోలువాఁ డితనికి నెం
         దును గల్గి కలచునో యీ
          ట్టి తనిగాఢపు మదము సొంపులీవులు చనునే."
                                                               (కళా. ఆ. 1, ప. 165)

అని పల్కు తరికి కథయొక్క యప్తిభారములో సగము సంపూ మయ్యెను. పిమ్మట లెక్కకు వచ్చునో రా దోయనునట్టి చిల్ల విషయముం బోని.

  • వ. అంత నమ్మహామునీంద్రుని యాజ్ఞానుసారంబుగాఁ దద్విమానంబు

      కలభాషిణి విహరించుచున్న యెలదోఁటలోనికిం దిగియె నట్టియెడ
      రంభా నలకూబరులును వినయపూర్వకంబుగ నతనిచేత ననిపించుకొని
     యప్పడెదుటఁ గాన్పించు వాసుదేవ పాసాదరాజంబునకుం జేయెత్తి
    మ్రొక్కి నిజేచ్ఛం జనిరి"
                                         (కళా. ఆ. 1, ప. 167)

అను వాక్యముతోఁ గల భాషిgధి నలకూ బరుని వలచుటకును గళా పూర్ణుని సుద్ది వినుటకును సహజమైన సమయముఁ గల్పించి తక్కిన సగము ననాయాసముగ ముగించిన యీ కవియొక్క ప్రతిభ యవాచ్యము గదా ! ప్రథమాశ్వాసము కథకు నాల వా ల ము. సమస్తములైన కార్యములయుఁ గారణ బీజంబులందు C జల్లబడి యున్నవి.

ఐక్యమును లక్షణము

                      సామాన్యకవులతోఁ బోల్చిచూచిన సూరన్న కళాకౌశల