పుట:Kavitvatatvavicharamu.pdf/129

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

122 కవిత్వతత్త్వ విచారము

లేవు. భారతమున ను పశాఖలు మెండు. కొన్పి శాఖలును గావు, ఏ సంబంధమును లేనివగుట. కావున నప్పడప్పడు దారిఁ దప్పి పరిభ్ర మించువారమై పిమ్మటగష్టపడి కథా రాజమార్గమునకు వచ్చు లోపల తత్పూర్వము పఠించిన భాగములు మఱపునకు వచ్చుటయు సహజము. మఱపునకు రాకున్నను వానిచే హృదయములో దీపించిన భావనాశక్తిం గొని పరిగణించిన భారతమునకు గౌరవ మధికము. ఒక్క యధికమన్నం జాలదు . హస్తిమశ కాంతరమన్నను సత్యము నకు న గౌరవము రాదు ?

ఈ యితిహాసములు సైతము కాలక్రమముగా వ్రాయ ఁబడక కార్యకారణరీతిగా కథల కెల్ల నా ధారభూతమగు విషయముతో నుపక్ర మింపఁబడి యుండినచో స్వారస్యమింకను నుద్ధురముగ నుండును. ఇవి త్రోక్కిన మార్గముననే వీనిలోని గుణములు మాత్రము లేని చిల్లర కావ్యములు తఱుచు పోయి యున్నవి.

             " అనేక విధ పదార్థ ప్రపంచ సంచితం బు, నుపపర్వ మహా పర్వోప శోభితంబు"గను నుండుట యొక్క కతముగ, నాదినే భారతమునఁ గథాసంగ్రహము నిర్వర్తింపఁ బడి యుండుటయు, "ద్వాపరాంతమునఁ బాండవధార్త రాష్ట్రలకు మహా ఫెూర యుద్ధం బయ్యె"నని వక్కాణింపఁబడి యుండుటయును. ఇందు చేc గథ కొంతమట్టునకు నే క్రీభావముం జెందుట, చదువరులకు ముఖ్యాంశ ములు గజిబిజిలేక యేర్పడుటయు నను గ్రేష్టములైన సిద్ధులు సేకు లినవి. రామాయణము నందు ను కాలానుసరణముచే గలుగు నైక్య భంగము సమర్థించు కొ ఆ9కుంటో లె సంక్షేపముగ నాది నే కథా భాగములు దెలుపబడియున్నవి.

కార్యక్షారణ క్రమమునఁ గథను వర్ధిలఁజేసినవారు ఆంధ్ర ప్రాచీన కవులలో నాకుఁ దెలిసిన సూరన్నదప్ప నింకెవరును లేరు. బహుశః ఈ మార్గ సంచారమునకు మొదలిడిన వాఁడి తఁడే యే మో! ఈ విషయమై ప్రభావతీ ప్రద్యుమ్నముంగూర్చి చర్చించుచో నొంత వ్రాసియుంటిమి. గాని యందును నది కళాపూర్ణోదయము ననుక రించినదని చెప్పలేదు. కార్యకారణ సమ్మేళనముచే నే క్రీభూతముగా వ్రాయ బడిన గ్రంథములలో గళాపూర్ణోదయము ప్రథమమ. స్వతంత్రముగ నవీన భంగుల రచించుట కవి యొక్క మహాప్రతిభకు ఫలము, సాక్షియును.