పుట:Kavitvatatvavicharamu.pdf/125

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

Í 18 కవిత్వతత్త్వ విచారము

ప్రకార మరయవలయు. వస్తువులు పుట్టిన జాడ నటు విడిచి, దానికి హేతువులైన వానిని వెచు కుచు వెనుక కును, దానినుండి సంభవించిన ఫలముల నరయుచు ముందు నకును విచారములు సల్పితి మేని యయ్యది కారణ క్రమము. వస్తువు యొక్క తత్త్వము ప్రకాశితమగుటకు నీ రెండు విధంబులు ననుకూలించినవ. వానను బ్రథమమునఁ బేర్కొని హేతువును గొనియాడి వానియందుఁ దదనంతరము పుట్టినది తేమయన్నను ఒక్క కేు. తేమను దొల్లఁ జూపి యూ సిద్ధికి నేమి కారణ మని యూ లోచించి వాన హేతువని యుటు తరువాత స్థాపించినను ఒక్క కేు. ఆలోచన యొక్క ప్రారం భావసానములు భిన్నములు గాని యది పోవు త్రోవ యొుండే. ಇಲ್ಲು ద్వివిధ గతుల జరించినను సిద్ధాంతవ్యత్యాసము లేమి కి గార మేమన, స్వభావమునఁ గార్యకారణజాలంబు నిర్వికల్ప మగు క్రమమును దాల్చి యునికి. వానచే నేల తడి యగుటయు, నేల యంతయు దడియుటకు వానఁ దప్ప నిం కే హేతువును లేకుండు టయు, నిజములైన. నీ ప్రత్యయముల నొకదానినుండి యింకొక దానిని వ్యక్తపఱుచుట సుసాధమ. నికరముగా నీయవయవమునే యూధారముగఁ గొని యో జింపవలయునను నిష్కర్షయుండదు. హేతువులయు c దత్ఫలములయు ననవరత సాంగత్యమే యు భయ క్రమములకుఁ దావలము.

వస్తుతత్త్వ పరిశీలక శాస్త్రములలోఁ గాల క్రమమునకుఁ బ్రసిద్ధి యెక్కువ ఎందుకన, ఎయ్యది సృష్టిలో నాది యో దాని నే గ్రంథము నను ఆదిగాఁ జూపిన శాస్త్రమునకు వైశద్యము. కావ్యములయందు దత్త్వముగాదు ప్రధానము. మఱి రసము. అట్లగుట మొత్తము మీఁద గాలక్రమమును విసర్జించిన బాగు. ఎందుకన,

'కృతినాయకుని తల్లి గర్భము ధరించినది. పది నెలలకు సుతోదయము. పిమ్మటC బెరిగినాఁడు. చదువు సాములు నేర్చి నాఁడు, ' ఇట్లని వ్రాసితి మేని రసము రెండు విధములఁ జెడును. నాయకుఁడు పుట్టి పెరిగిన విషయములలో మన కేమి యక్కఱ ! లోకములో నున్నవారందఅు పుట్టకయు పెరుగుదురా ! మఱి వాని యందు మనకుండు శ్రద్ధకు హేతువు వాని యొక్క గొప్పతనము. గొప్పతనమునఁగా గుణములచేతనో, తన పడినపాట్లచేతనో, తాను సాధించిన మహెూద్దండ కార్యములచేతనో, మన మనసులఁ దన యొద్దికి లాగికొను గుణము. కావున నట్టి ముఖ్యాంశములను, వానితో గాఢమగు చెలిమిఁ జెందిన విషయములను మా ! తము