పుట:Kavitvatatvavicharamu.pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమ భాగము 1 11

భాసితులై దేశదేవతలఁ బోని సేనానాయకులు, ప్రకృతిశాస్త్రవిచక్షణులు తత్వార్థదక్షులు, ఇత్యాది చరితార్థుల సంగతి పాంతఁబోక , cగుమ్మములోఁ గూరు చుండి దొరతనము-అనఁగా నింటివారిమీద చేయు మహా రాజును దప్ప నింకెవరిని జూడని భార్యకు వాడెయఖండపరిపూర్ణుడుగాఁ దోఁచునేమో ! ఒకేయాకారము గుఱి వెట్టి యస్ఖలితంబుగఁ జూచుచుండిన నది నిరాకారబ్రహ్మమట్టులు పరిణ మించునే మో ! కాకి బిడ్డ కాకికి ముద్దు తమ తల్లినిమించిన రూప వతులు గుణవతులు లేరని చిన్నబిడ్డలు నమ్ముదురు. పెద్దవారై యు నేకులం జూచినపిమ్మటC బోల్చి జూడ నారంభించి తక్కినమ్మల యుత్తమత్వము నొప్పికొనుట గలదు. ఇంకొక రెక్కువవా రున్నా రనినంతనే తల్లిమీఁద ప్రేమపోవునా ? పోవునని బుద్ధిశాలినియైన యే తల్లియేని నసూయ వహించునా ? జనముల తారతమ్య నిరూ పణకృత్య మొు కటి. అనురాగపాత్రములని భావించు కృత్యము వేఱొకటి. ఈ రెండును సర్వత్ర యైక్యభావముం బూనునవిగావు చూడు Cడు. శంకరాచార్యుఁడు ఘనుఁడైన తార్కికుఁ డన్న మాత్రముననే యతనిని గౌCగలించికోవలయునని యందఱకు బుద్ధి వొడముట యావశ్యక మా ? నైజమా ? తర్కము బలముగా నుండ వచ్చును. రూపము దక్కువగా నునికి, గుణము సర్వసమ్మతము గామి. దానితో సంశ్లేషింపఁజాలిన ప్రకృతులు విరుద్ధములు గావు. అట్లగుట వ ల పున కుత్పాదికములగు వేయి హేతువులలో నొకటి యున్నయెడ సర్వస్త్రీలును వానిపైC బడుదురని నమ్మవారును, నమ్మి యట్లు నడచువారును మనుష్యులా? జడులా? స్త్రీల విషయమై మాత్సర్యముం దాల్చువారికి రెండు విధములగు భ్రమలు గలవు. ఏవియన, తాము పరిపూర్ణులై యున్నంగాని వారు హృదయ పరి పూర్ణముగఁ దమ్ముఁ గామింప రనియు, నెవనియందైన నేదైన సుగుణము అధికముగా దేదీప్యమానమై యున్నచో, వాఁడు గంటఁ బడే నేని, తక్కిన గుణముల సంగతి యాలోచింపక, వానిపై నుద్దండముగాఁ బడుదురనుటయు, ఈ యెన్నికలు రెండును హేతు రహితములు. సర్వగుణ సంపన్నుఁడైనవానితో విసుగు దవిలిన మనసుతో గుఱ్ఱపు వాని వలచువారు లేరా ? తుదకు ఉన్నతులగు పురుషులు సైతము, ఏన్నో తబ్బిబ్బులకు లోపములకు నాకరము లైన భార్యలమీఁదఁ జూపు ప్రేమా వేశమును, నిరంజనుఁడైన దేవుని యందుఁ బ్రకటింపఁ జాలు దురా ? చిత్తము పలుపోకలఁ బోవునది. గోడలచే నెట్లునిరుద్ధము గాఁ జాలదో య ట్లే కారణమునకును