పుట:Kavitvatatvavicharamu.pdf/109

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

102 కవిత్వతత్త్వ విచారము

             స్సామర్థ్యం బరయన్ మహాత్మవని యన్మద్బుద్ధికిం దోచె దా
             హా మూభావము గానలేవె మదిలో హంసీ భయం బేటికిన్
        వ . ఆనిన  నది  మదిరాక్షి  నీక్షించి  యిట్లనియె.
        క. నీవనినయట్ల యేను భ
            యావహులను గానివారి నాకృతిన కనం
            గా వలఁతినైనఁ బిలువక
           యే వెట్టినె చేర నిరువు రేకత మాడన్.
    వ. అనిన వెఱఁగంది యా యిందుముఖి సఖియునుం దానును నొండొరుల మొగంబులు చూచి నగుచుఁ జెవులకుం జవులు మివుల నలవరించి గులుకు టెలుంగుగల కలికిపలులకె వలచిమొలచు కుతుకంబున నతివశంవద హృదయలై తమకిద్దఱకుం దాని పెద్దబుద్ధులు సుద్దులు ముద్దు రప్పించుచుం దద్దయు నుద్దీపిత రాగంబు లగుచుండు రాగవల్లరి యాగఱువతనంబులాగు లేగరితలందును మున్నుకన్న విన్చయవియె దీనికఱుదు లెంత యరుదులు. చూచితే యంచు నాయంచపై నాదరాహ్లాద మేదురనిరీక్షణంబుల నీక్షించి యోపక్షికులభూషణంబ నీభాషణంబు నిక్కంబ మిక్కిలి నక్కఱపడి వేఁడక పోడలగుగఱువ లిరువు రేకాంతమాడుచోటి కేటికిఁ బోయెద రిది యట్లుగాదు గదా యేమొక్క సందియంబు నివర్తించుకొనఁగోరి యిత్తటి నత్యంత ప్రార్ధ నంబు గావించుచున్నవారము గావున నీ కన్న యప్పరుషుని యొప్ప నిప్పలకపై వ్రాసినరూపంబు చొప్ప నొక్కటియగునో కాదో యీ దండకు వచ్చి నిచ్చలంబుగాఁ జూచి నిశ్చయించి చెప్ప మిప్పడుచు నేను నిట్టివాఁడెందును లేఁడుకలఁడను వివాదంబునం బన్పిదంబు చఱచినవారము.
           క. అనుటయుఁ బందెము కొఱకై
               నను వేజోకపనికి నైన నా కది తెలియం
               బని గలదె మీకు నాచే 
               వినవలసినయర్థ మరసి వినిపింతుఁ దగన్.
          తే. అనుచు శుచిముఖి తనమాట కాపడంతు
              లీక్షితాన్యోన్యవదనలై యెంతదూర 
              మరుగుచున్నది దీనివాక్యాశయ మని 
              మివల వెఱఁగందఁ గొంత చేరువకుఁ బోయి.
          క. సవిమర్శదృష్టి నాటిత
              కవిధాన మొకింత నడపి కడుఁ బదిలముగా
              వివరింప నతనిరూపము
              యవు నౌ నదీ యిందు నందియము లేదనియెన్.