పుట:Kavitvatatvavicharamu.pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

 ప్రథమ భాగము 101

             చ్చట నచ్చట గలఁ డని య
             క్కట నన్నిట్లేచు టంబకరుణ తెరంగె.
         సీ. అని పల్కు పలుకు నాయవనరంబనఁ దత్స
                           మీపంబునం దనురూపవతిని 
             శుచిముఖి సంచరించుచు విని యిత్తన్వి
                           చిత్తంబు వడసి యేఁ జెలిమికలిమి 
             హత్తిచుకొనుటకు  సనుగుణం  బగు వేళ
                            యిదియ యటంచు నూహించి మదిని 
             దగునుపాయంబు వితర్కించి యపుడు య
                            దృచ్ఛనవోలె నా తెఱవయోుదుట
         తే. నడ్డముగ నల్లనల్లన యరుగుచు నవి
              మర్శదృష్టిచేఁ బలుమఱు మరలి మరలి 
              చిత్ర ఫలకంబు వంకవీక్షించెఁ గొంత 
              సరిగడచుదాక నొకవింతసరణి మీఱ.
         క. అపు డమ్మరాళి చందం
             బుపలక్షించుచుఁ గపోలయుగ్మము దరహా 
             సపుఁ కాంతిఁ దనరఁగా నా 
             చపలేక్షణ తనదు ప్రాణ సఖి కిట్లనియెన్. 
         క. కఱదులపులుఁ  గిది   తానే 
             మెఱుఁగునోకో తిరిగి తిరిగియినా ఫలకముపైఁ
             బఱపెడుఁ   జూడ్కుల   నా  నా
               మెఱుఁగుంబోఁడికి మరాళి మృదుమథురోక్తిన్.
   వ.   ఇట్లనియె .   నోపడంతి  నీపలికినట్లు మా యట్టితిర్యగ్డంతువు లేమియు   నెఱుంగమి యథార్థంబయైనను నేను నీచేత చిత్ర ఫలకం బబ్రపడి చూచు టకుం గారణంబు వినుము. మున్నొక్కచోట నొక్కపురుషుం జూచి తత్సమాన రూపునిమఱి యెందునుం గానక యిప్ప డిందు నతని కైవడి దోఁచిన నిది తదీయ రూపంబెఱింగి వ్రాసిన తెఱంగో యటు గాక యట్టివాఁడె వేళొక్కఁ డెక్కడనైనం గలిగెనోయని యించుక విమర్శించి వీక్షించితి నన విని ప్రభావతి యద్భుత ప్రమోదసందేహంబులు డెందంబునం గ్రందుకొనుచుఁ గందPంప నప్పలుఁగుందప్పక చూచి యిట్లనియె.
  శా.  ఏ మేమీ యిఁక నొక్కమాటు చెపుమా యీ వున్న రూపిట్లయో 
         యేమైనం గలదో విభేద మిట రమ్మీ క్షింపు మింకన్ వచ