పుట:Kavitvatatvavicharamu.pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమ భాగము 99

             ఉ. ఏనొక యించుకంత మనసిచ్చిన మాటలు పల్కకుండగాఁ 
                 గాని మరాళి యద్దనుజ కన్యకకైనను నొత్తిచూచి యే 
                 మైన ననంగఁ బూనునని యాత్మకుఁ దోఁచుచు నున్న దిప్టు, కా
                 దేని (పసంగముం దిగిచి యేల నుతించుఁ దదీయరూపమున్.    6
            మ. అటుగాకద్భుత రామణీయక గుణాఢ్యంబైన సద్వస్తువుం
                 బటు వాచార సికుల్ ప్రసంగమయినన్ బారంబుముట్టన్ రసో
                 త్కటతు జెప్పక మానఁజాల రను పక్షంబొండు భావించినన్             ఘటియిల్లున్ వనితాంగ వర్ణనకు నిక్కం బన్యధా సిద్దియున్.                          7
             చ. హరియును వాసవుండు, దము నంపిన కార్యము హంసి దానయై
                 ధరణికిడి చెప్పి మదుదగ్రమనస్థితిఁ గాంచు టెన్నగా
                 సురరిపుఁ జంప నన్ననుపు సుద్దులు వట్టఁగ బోలు నెల్లడన్  సరసిజనేత్రు దక్షిణ భుజంబవు నీవని పల్కినందునన్.                                8
             ఉ. అన్నియు నేకవాక్యముగ నారయ నాసలు వెంచుపక్ష మే
                 యున్నది కొంతమించి యిది యోజన సేయఁగ నాదురూపె యా  
                 కన్నియచేతి చిత్ర ఫలకంబున నున్నది యెవ్వరచో
                  నన్ను నెఱుంగవ్రాయననినన్ శివప్రాయుట వింటిఁజూడఁగన్.    9
              ప్రభావతీ   రాగవల్లరుల   యే కాంత గోష్టులు  బహు రమ్య   ములు.   అందఱకన్న నుత్తమపాత్రంబగు     శుచిముఖిం   బ్రశంసించి    ప్రభావతీ   ప్రద్యుమ్నుల    నింతటితో      వదలుదము .     వారును     వదలినఁ జాలునని యు త్కంఠమై    గ్రుక్కిళ్ళు      మ్రింగుచున్నారు !
                                        శుచిముఖీ చరిత్రము
   వజ్రనాభుని  పురంబులోని  విశేషంబులు  మీ రెఱింగి  తెలుపుం డని మరాళముల    నింద్రుఁడు  నియమించు  నపుడు,  ఈ హంసి కథలో  బ్రవేశించి, యతనితో  జిత్ర ఫలక    వృత్తాంతముఁ దెల్చి,     యి (క  దైత్యునకుఁ గల మాసన్నమయ్యెనని   ధైర్యము   చెప్పినది. ఆ సందర్భములో    నింద్రునితో జెప్పినట్లు    రాగవల్లరీ    ప్రభావతులకు      ప్రద్యుమ్నుని      విషయమై నడచిన సంవాదమును    నివేదించి     నది .     పిమ్మట    ప్రద్యుమ్నునికి   వలపుపట్టునట్లు     నాయకురాలిని   వర్ణించుట   పూర్వమే   తెలిపియున్నాము. అందును   బింకమును   స్త్రీ   స్వభావమును   వెల్లడి   సేయుచున్నది.   ఎట్లన,  ఈ కార్యమునకై   యేతెంచినదయ్యు   ప్రద్యుమ్నునితో "రహస్యమైనదియె  యౌ ను