పుట:Kavitvatatvavicharamu.pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

98 కవిత్వతత్త్వ విచారము


    "సీ.  తొలుదొల్లనయ్యేక తురగంబు మండల                                                            గతిచారియగుచు నిక్కంబు దోఁచె                                                                                                  నావెనుకను నరూపాశ్వాలి చెదరక

చక్రాకృతిని బర్వునరణిదోఁచె నంతటననతిన్పుటావయవంబుగా

     నెనసియేకాంగ వేష్టనతఁ దోఁచెఁ                                                                                              దుదిఁ దద్విభూషణ ద్యుతిరాజి మాత్రంబు
      కొఱవి త్రిప్పినరీతి మెఱసిదోఁచె
  తె.   నంతకంతకు గతివేగ మగ్గలింప                                                                                           రాఁగవాగె యెచ్చరిక పరాకుజియ్య                                                                                          యను జనులు రిచ్చవడి తమపని మఱువఁగఁ                                                                       బరఁగునమ్మేటినెఱరౌతు ప్రొఢికతన.”
                                                                                               (ప్రభా. ఆ. 2, ప. 32)

ఇట్టి వేగము అనుభవమున లేకున్నను, ఒక వేళ నంత వేగము తటస్థించినయెడల కవి వర్ణించిన యాకృతులు గోచరించుట 'రఁకల్ రాట్నము' జూచినవారికెల్లఁ దెల్లము. అత్యుక్తియుండిన నిట్లుండ నొప్ప, శుద్ధముగ నసాధ్యమని తోఁపఁగూడదు. యపురూపములైనను భావ్యములుగనున్న స్వారస్య మెక్కువ. విరాళిపాలైన ప్రద్యుమ్నుఁడు నిర్ణేతుకములగు నుత్సాహ నిరుత్సాహ స్థితులందాల్చి లేనిపోని కారణముల నూహించుట మోహగ్రస్తులకు స్వాభావికమైనస్టితి. ఇది యీ కవి వరించినట్టూ లితరు లెవ్వరుఁజెసినజాద నాకు0 దెలియదు.విను0డూ

   "చ. శుచిముఖి మాట యోుండరసి చూడఁగ నెంతయు నాసపా టోన
         ర్చుచుమదిఁ ద్రిప్పచున్న యది, చూడ్కికి నన్ను నెపోలువాని నా
         రుచిరతరాంగి చిత్తరువ రూపొకటిన్ రహిఁజూడఁ జెప్పెఁ ద
         ద్వచనము చొప్ప నేమినియతంబు సమాకృతులెందుఁ గల్గవే."
                                                                                   (ఆ. 2-4)
   "చ. ఇది పదిలంబుగా నడుగకే నపుడక్కట కోర్కి దాఁచిన
         టిదొరతనంపు నీటు ప్రకటించితిఁ, బాపపు లజ్జ నన్ను నో
         రదిమె, ననాదరంబు తెఱఁగై యది హంసికిఁ దోఁచె నేమొ ! ని ల్వదమణియించుకైన, గఱువల్బవి గాని కథల్వచింతురే!”.