పుట:Kavitvatatvavicharamu.pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

96

                            కవిత్వతత్త్వ విచారము

తోఁచుచున్నదిగాని నిజము చెప్పలేను ! ఇవియ మనవారి రాగములు. కోమలత, మార్దవము, సౌకుమార్యము మొదలగు సౌమనస్యంబులకు వెలియైనవగుట నాగరికపుఁ జందముగలవారికి నింపుగావు. మఱి పూర్వకాలపు నవాబులు, రాజులు, పాళయ గాండ్రు మున్నగు మోటు వారికి తగియుండు నేమో. భావించు టయు బహు ప్రయాసమ. ప్రభావతీదేవి తరువాత శాస్రోక్తరీతిని బొలయలుక దాల్చగా నాయుమ (దేర్పం బ్రయత్నించి, యెంతకుఁ దేఱకున్న (నియమితకాలము నిండని దా యమ్మ తేటిన నది తప్పగదాయని ? యోజింపనంత మూడుఁడు) ప్రద్యుమ్నుఁడు నిప్లురముగా "దానవునకు నుదయించినదానవ గావున లతాంగి ! ζ) దయ చాలదు" అని, భార్యమీఁదఁ గోపము వచ్చిన నా మె ಬ್ರಿಟ್ಟು పూర్వోత్తరాల నెల్లఁ దడవి తడవి వాపోవవలయు, నను సనాతన హిందూగృహస్థధర్మము నుద్ధరించుటయు మిక్కిలి చిత్రము. ఈ పాలయల్కకు (పేరకము శ్లేష, మగఁడు ఒకయర్థము నూ నిన వాఁడై "రతీ ! భవదుత్తమరతీ !" అని ధ్యానించుచుండCగా, నందు వేజోకయర్థము గని పెట్టిన ప్రభావతి

“పట్టపు దేవియైనరతి
                      బ్రాంతినె పల్కెదవేమొ నాథ ! నే
                      గట్టిగ నారతి ప్రమదఁగాను!
                      ప్రభావతి యండ్రు నన్నిలన్ !”

అని యతనికిఁ దన పేరెత్తి చెప్పనంత కోపనయగుట సహజము. ఈ ణయకలహముచే ప్రద్యుమ్నునికి విరహవేదన రెండవ తరం గము రీతిఁ బొంగి పొరలఁగా, హంసకు దనకష్టముఁ దెలుపుచు, నా మూట గా ( బ్రాణేశ్వరితో జెప్పమని యేమని వ్రాయుచున్నాఁడు. ద్విరదగతిరగడ “ఓహంసి నీచేత

నీమోవి చిగురుఁ దేనియలు ಗ್'ಠಡಿ యూస
                    ನಿಮುಲು నవ్వవెన్నెల చలువగొను నాస
                    నీమృదు కపోల సన్నిధిని మోమిడు నాస
                    నీమోహనశ్రోణి నిమురఁగలిగెడు నాస
                    నీదు పాలిండ్ల నానెడు వక్షమను నాస
                    నీదు శృంగార కళనెలవులంటెడి యాస
                    నీదు మణితామృతమునింతుఁ జెవిననునాస.”

                                                                     (ప్రభా. ఆ, 5, ప. 152)