పుట:Kavitvatatvavicharamu.pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమభాగము

                                                                                           95
      “క.  వత్తు నవశ్యము నేఁడని
           చిత్తము తమిరేఁచి యంతఁ జింతయొకతె పై 
           హత్తిన నదివృథ వచ్చినఁ
           బుత్తురు మగవారిమాట పొసగదు నమ్మన్.”

(ప్రభా. ఆ. 4, ప. 147) ఇట్లుత్కంఠC గోనియుండి యు శాస్త్ర ప్రకారము చంద్రోపాలంభ నము సమకూర్చిన యీ పెయొక్క మన స్ట్సెర్యమును, కవియొక్క సందర్భశుద్ధిని పొగడుటకు నాది శేషునకైన నలివియా ? పిమ్మట చంద్రునివదలి దక్షిణా నిలునిఁ బట్టినది. అటుతర్వాత నతని క్రొ క్రింత విరామ దానం బొసంగి, మన్మథునిపైకి దూ ఁకి, యూ యుల సటు చేత శాస్త్ర క్రమముగC, బ్రాణములు కంఠగతములుగాఁ గా, ఇదే చచ్చెదను జూడు ' మని "తెప్పలు దేలవైచుచు" క్రిందబడిన నొప్పి గదాయని "పూలపాన్పున వ్రాల బోవుటయు" పూర్తిగా వ్రాలలేదు! ఈ తమాషా నంతయు ప్రచ్ఛన్నరూపముతో డ్రామారీతిగాఁ జూచు చుండిన ప్రద్యుమ్నుఁడు ప్రత్యక్షమై పట్టుకొనఁగా, అమ్మకు నెక్కడలేని సిగ్గువచ్చినది. పాపము ! ప్రభావతి యెంత మంచిది! తన బాధలు దనకుండఁగా నలంకార శాస్త్రమున కే బాధ యు రా (గూడదని పరోపకారవృత్తియై, ప్రతిదూషణమును, ప్రతిదశను దప్పక యాదరించి చూసినది గదా ! వరుఁడును ఎంత ధీరో దాత్తుఁడు ! ఈ నాట్యములన్నియు ముగియువ అకుఁ దమిని బిగఁ బట్టిన యోర్పుకాఁడు ! అయ్యో ! దరిద్రమా ! అనివార్యమైన మోహమును గోఁతిఁవలె నాడింపఁజూచుట శృం గా ర మా ! వికార మా ! ఇంతటితో ఁ బోయో నా ? ప్రభావతి ముప్పది పద్యముల రోదనము శ్వాసము బిగబట్టి, పూజారులు మంత్రముల నేకరువు వెట్టినట్టు త్వరత్వరగాఁ జేయుచుండఁగా, 'ఏమమ్మా' యనియైన నడిగినఁ గాలయాపనముగదా యని యుచితమౌనముం దాల్చిన శుచిముఖీరాగవల్లరులు, వధూవరులు పడుకటింటికిం బోయిన వెనుక వెన్నాడి మధ్యస్థలములకుం జొచ్చుట మనవంటి వారికి జోఁతయనిపించును. వారెంతో దయతో నా గాంధర్వపుఁ బెండ్లి కూఁతును బిలుచుకొనివచ్చుట, బుద్ధులు గఱపుట మొదలగు వేడుకలున్నవి “తిగిచిన రాక యీడిగిలంబడిన" దఁట ! చెలికత్తె లును శాండో కుస్తీ చేసిన బలశాలినులుగావున నెట్లో తుట్టతుదకు దేవి గారిని “ఏనుగుఁ గంబా నకుఁ దెచ్చినట్లు" తెచ్చి విభునిముందఱ నిలిపి యొక చిన్న యు పన్యాసమిచ్చి వెళ్ళినారు. వెళ్ళినారని