పుట:Kavitvatatvavicharamu.pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

 94 కవిత్వతత్త్వ విచారమ

“ఉ. వావిరినెల్ల ప్రొద్దును భవత్పరిరంభణచుంబనాది నా
                   నావిధభోగలీలకు మనంబున నువ్విళులూరుచున్కి వ్రీ డావతి దెల్పెఁ గొన్ని నిశలం గనుమూసినయంతమాత్రఁబై పై విలసిల్లు కుట్టమితభావ విశేష విజృంభణంబులక్.”</poem <poem>“ఉ. కలలం గూడినవేళ నెట్టి పొలయల్కల్పుట్టెనో, యేమి నీ
                      వలనం దప్ప ఘటిల్లెనో, యెఱుఁగఁ,దత్స్వప్నాగమామర్షదవి హ్వతిత స్వాంతయుఁబోలెఁ నిద్రనెఱయకా వర్ణించెఁ బద్మాక్షి య క్లు ల హెూరాత్రములందుఁ బద్మకుముదస్పూర్తిన్విడంబించుచున్."

(ప్రభా. ఆ. 4, ప. 75, 76, 77) ఇది జావళీలకన్న నికృష్టమైన పాళయగాండ్ర శృంగారము! ಇಟ್ಟಿ యనౌచిత్యములఁ బలికిన జనబాహుళ్యమునకు వేదాంత వాదములచే నగుదానికన్న నెక్కువ విరక్తి తటస్థించును. ఇదియ సరససల్లాపమని భావించు మృగప్రాయు లింకను మనదేశమున నున్నారా ?

            ప్రభావతీదేవి కన్నెయయ్యు నారితేఱిన గణికలకృత్యముల శ్రద్ధగాఁ జేయుటయం దెంత ప్రొఢయో యీ పద్యమునఁ దెల్లం బయ్యెడిని. -
                  "సీ.కెళీ గృహంబు ముంగిట గర గరికలా
                                   లోకించు గంధాంబు సేకమరయు,                                                                నలుకు పూఁతలఁ బరిమళముఁ బరీక్షించు

రంగవల్లికల తెఱంగుఁ జూచు, నకి నల మంచంబు జాడ విమర్శించుఁ

 గుంకుమ పఱపు భంగులు గణించు,                                                                                                హెుంబట్టు తలగడ యొప్ప విచారించు
          నగరు ధూపముల సోయగములెంచు,
      తే. నలరు టోవర్లుమేల్కట్లు నంగరాగ

పూర్ణపాత్రికలును గందవొడి బరణులు జాలవల్లిక లాదిగా సముపభోగ సాధన శ్రీలు పరికించు సారెక బల.”

                                                                                  (ప్రభా. ఆ. 4, ప. 144)                             ಇಲ್ಲು భోగసాధనములెల్ల సమకూర్చి సర్వసన్నాహ సమేతు రాలయ్యు బ్రియుఁడు రాఁ గొంత దామసించినందున, మఱియొక్క విరహప్రలాపమునకు మొదలుజొచ్చి యేమనుచున్నదనఁగా.