పుట:Kavitvatatvavicharamu.pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

 ప్రథమ భాగము 93

రెట్టివారు ? దానితోc దుష్టిజెందువా రింకను నెట్టివారు. ఈ లసత చిత్తవికారముగాదు. మనోవిభ్రణముగాదు. ఆత్మ స్పర్శని శరీరతాపము. రోగికి మందువలె, వినికిచేతనే ప్రజ్వరిల్లు న్నెలకు నాయక సంగమమును తాపహరము. మనోహర మనుట ంకు. మన్మథుఁడు మనోభవుఁడట! దానికన్న నంగభవుఁడనుటలో ర్ధ ముత్కటము !

              “క.  అని నిజ శంకల కన్నిటి
                   కిని బరిహారములు సెప్పి గెంటక యుండఁ                                                               దనయాస నిలుప దితిసుత
                   తనయ రమణుఁ గవయ మిగులఁ గమకించు మదిన్.”
            వ.        హంసిం జూచి.
            “సీ.      నీ చెప్పినట్ల యిన్నియునైన మొదలఁ ద
                                త్పుర మెంత దవ్వి నీ వరుగుటెపుడు
                         పోయి వేళయెఱింగి పొసఁగ నవ్విభున కీ
                                  దృశమైన నా కోర్కిఁ దెలుపు టైపుడు
                         తెలిపిన నేవిప్నుములకు లోపడక నా 
                                     పై నతఁ డనుకంపఁ బూనుటెపుడు
                          పూని తా నిచటికి రానొక్క నెపమున
                                      గురునాజ్ఞ దొరకించు కొనుటయెపుడు
     తే.      వట్టి పెనుమత్సరపురాశి వజ్రనాభుఁ
               డస్మదిచ్ఛకు ననుకూలుఁ డగుటయెపుడు                                                                విరహవారిధి నేఁగడ వెళ్ళుటెప్పడు                                                                                             వలవని దురాసిలను గుమూరిలులె గాక.”
                                                                             (ప్రభా. ఆ. 3, ప. 120, 121, 122)
              ఇది గఱువతనము ! మితభాషలేని జావళీ సరసము ! కల ూం స ప్రద్యుమ్నునితో నమ్మగారి వేదనల నెంత మఱుఁగు వెట్టి నుడివెడినో యాలకింపఁడు !
                             "చ.   కొసరక చూపుచేతఁ గడుఁగోలిన నీ చెలువంబు చెల్వమా                                     ననమున నెంతమిక్కిలి ఘనంబుగ హత్తెనొ కాని యప్పడో                                                                         రసిక శిఖావతంన ! యుదురత్నమ ! కాకరకాయ రీతీగాc                                                               గిసలయపాణి చన్నుఁగవక్రెవ గగుర్పొడిచెం బొరింబొరిన్."