పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నాటక కళా సంస్కరణము

93


మణివలె నున్నదనియు; అందులో లేనిబూతులు ఇందులో గూడ లేవనియు, మేము నాటకశాలనుండి వెడలివచ్చిన యనంతరము చాల నీతిప్రదమైన కథ జరిగినదనియుఁ జెప్పెను. మొదటి విషగుళికతోడనే మా జీర్ణశక్తి నాశనమైనది ? ఆపైని విరివిగాఁ బంచిపెట్టబడిన నీతిఖాద్యములు మే మొకవేళ గైకొన్నను నిరుపయుక్తములై యుండును.

తరువాత ఆ రెండు నాటకములలోని సంవిధానములను నేను జూచితిని. సుమతి నాటకము చింతామణికిఁ బ్రతిబింబముగ వ్రాయఁబడి యున్నదనుటకు సందియములేదు. నే నిప్పుడు చింతామణిని సమర్థించుటకుఁ బూనుకొనలేదు, కాని, ఆ రెండు నాటకములను సరిపోల్చినప్పుడు మాత్రము, సభ్యతయందు చింతామణీయే మెఱుఁగుగనున్నది. చింతామణికారుడు రచనా నైపుణ్యముతో వెల్లడించిన బూతులను సుమతి నాటక రచయిత జట్కా బండివారి సభ్యతలోనికి దింపి, శృంగార రసమును సిరాబుడ్డిలో ఊరవేసినాఁడు. ప్రకరణమున కిట్టి వస్తువు ఆవశ్యకమని అలంకార శాస్త్రముయెక్క మఱుఁగు సొచ్చినను, అభిరుచి విషయకమైన చర్చ వచ్చినప్పుడు, దానిని కవియొక్క చిత్తసంస్కార పరిపాకములకు సంబంధించినదిగ మన మెఱుంగుదుము. మృచ్చకటికము ప్రకరణమయ్యు సహృదయులకు ఏవపుట్టించు బూతుకూఁతల మట్టునకు దిగ లేదు. అట్లనుటవలన సంస్క తమునందు, అధమములైన ప్రహసనములు లేవని నేను నుడువుట లేదు. కాని, అవి సహజముగ నిరాదరింపబడినవి. నింద్యవిషయ మేభాషయందున్నను నింద్యమే. భావమువలన