పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మర్మకవిత్వము

87


వైష్ణవ గీతములలోని భక్తిపారవశ్యమును_వీని మూటిని ఆత్మసాక్షాత్కరించుకొని మించిన స్వకీయ ప్రతిభావ్యక్తిత్వములును సామరస్యము నొందినవి. కావున రవీంద్రుని యాధ్యాత్మిక కవిత్వము ప్రాచ్యపాశ్చాత్య మనస్తత్వముల కనుగుణమైన సంధిస్థానమై యున్నది.

'తుమి యేన్ ఒయ్ ఆకాశ్ ఉదార్
 ఆమి యేన్ ఎయ్ అసీమ్ పాథార్
 అకుల్ కొరేచె మాఝ కానే తార్
 ఆనందపూర్ణిమా'

(మానసి - ధ్యానము)


 [నీవు విశాలమైన ఆ యాకాశమవు;
 నేను సీమారహితమైన యీ సముద్రమును ;
 వాని రెంటిమధ్య ఆనందపూర్ణిమ
 తాండవించుచున్నది.]

ఆంగ్లేయ సారస్వత సంబంధమువలన బెంగాలునందు, వలె తెలుఁగు దేశమున సైతముఁ గొంత యూందోళనము గలిగినది. యువక కవులు సంప్రదాయసిద్ధములైన పురాతన పద్దతులను ద్యజించి స్వతంత్రముగఁ క్రొత్తదారులు త్రొక్క సాగిరి. ఇప్పుడు తెలుగు దేశమున నాంగ్లేయ వాఙ్మయ పరిచితి గల యువక కవులందఱు కొద్దిగనో గొప్పగనో Romantic కవు లనుటకు యోగ్యులు. రవీంద్రుఁడు 'నోబెల్‌' బహుమానముచే సత్కరింపఁబడి యాతని కావ్యములు హిందూ దేశమంతటను వ్యాప్తిచెందిన యనంతరమున తెలుఁగు రొమాన్టిక్ కవిత్వము ఆధ్యాత్మిక కవిత్వ