పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/91

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

మర్మకవిత్వము

85

   ఇంపుకాదూ మెప్పూగాదు ఎన్నరాని యీ బ్రహ్మపదవి
   చప్పరించి చూడండన్న సారా మున్నాది.

2. తనకు బొందెకు ఎపుడో తగులాట మాయెను
   వీరెవ్వరో గురుడ! వా రెవ్వరో!
   పుట్టి బూరగమాను పూసి లెస్సా కాసి
   గట్టిగ కొమ్మలు కదిలాడగా
   సుడిగాలి దెబ్బకు తొడిమజాఱిన పండు
   తొడిమాతో యేమైన నుడివిపోయిందా;
                      తనకు బొందెకు...........................
                      వీ రెవ్వరో గురుడ.........................

3. చిత్తాస్వాతులు రెండు సంధింప ముత్తెపు
   చిప్పాలో పడ్డాది చిను కొక్కటి,
   ముత్యమై నీళ్ళల్లో మునిగి పాయ్యేనాఁడు
   చిప్పతో యేమైన చెప్పిపోయిందా ?
                     తనకు బొందెకు..............
                     వీ రెవ్వరో గురుడ

వేమన పద్యములలోని భావములను గ్రహించి కొందరు, వానినిఁ గీర్తనలలో నిమిడ్చిరి. అట్టికీర్తనలె యిప్పుడు తెలుఁగు దేశమునందుఁ జాలవఱకు వ్యాపించియున్నవి.

సమకాలీనమైన ఆధ్యాత్మిక కవిత్వమునుగుఱించి కొంత విచారించి యీ వ్యాసమును ముగించెదను. బెంగాలు దేశమున రవీంద్రనాథ టాగూరును, ఆయన కవిత్వమార్గమును మెచ్చుకొని దాని ననలంబించు సత్యేంద్రనాథదత్తు మున్నగు నితర యువక కవులును ఆధునిక కవిత్వ సంప్రదాయమునకు సంబంధించినవారు. ఈ తెగకు రవీంద్రుఁడు మార్గ