పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/87

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

మర్మకవిత్వము

81


తెలిసికొని, సమకాలీనుల యజ్ఞాన జనితమైన నిరాదరణము నిట్లు తూలనాడెను.

యేనామ కేచి దిహ సః పథయం త్యవజ్ఞాం
జానంతి తే కిమపి తావ్ప్రతినైష యతః
ఉత్పత్స్యతే౽ స్తిమమ కో2పి సమానధర్మా!
కాలో హ్యయం నిరవథి ర్విపులాచ పృథ్వీ

ఈ విశాల ప్రపంచమునందు సనంత కాలమునఁ దనతోడి సమాన ధర్మముగలవాఁ డెవ్వడై న జన్మించి, తన నాటకమును చదివి యానందింపఁడా! యను తలంపు భవభూతిని నూరడించినది. ఎంతసహనము ! ఎంత స్వార్ధ త్యాగము ! నేఁటి కవులు అప్రయాస లభ్య జనరంజకత్వమునకయి తమ శక్తిని వ్యర్థపుచ్చుచున్నారు.

మాలర్మి ప్రభృతుల కావ్యములలోని సూచనలను, అస్పష్టతను దోషములుగఁ బరిగణించి టాల్ స్టాయి ఖండించుటయందుఁ దప్పులేదు. ఏలయనఁగా : ఆయనకుఁ దోఁచిసట్లును, ఆయన భావించినట్లును దాపఱికములేక విమర్శించెను. ఇది చాల గొప్పతనము. కాని సామాన్య ప్రజల మనస్తత్వమును బ్రమాణముగఁ గొని, ఆ కావ్యములలోని విషయములు వారి కగ్రాహ్యములు గాన దోషము లని తీర్మానించుట సాహసము.

మన దేశమునందు 'మర్శకవిత్వ' మనాదియైనది. దానిని మర్మకవిత్వమని పేర్కొనక ఆధ్యాత్మిక కవిత్వమని వ్యవహరించెదను. ఏలయన, ఆలాటి రచనలను మర్మకవిత్వముగ మన మెన్నడును భావించినదిలేదు. హైందవజనసా